తెలంగాణలో వేసవి సెలవుల పొడిగింపు? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..
తెలంగాణలో వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. వచ్చే సోమవారం నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో నెలకొన్న వాతావారణ పరిస్ధితుల దృష్ట్టా ప్రభుత్వం వేసవి సెలవుల్ని పొడిగించవచ్చన్న ప్రచారం జరుగుతోంది. వడగాల్పుల దృష్ట్యా వేసవి సెలవుల్ని కనీసం మరో పది రోజుల పాటైనా పొడిగించే అవకాశం ఉందని విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీనిపై ఇవాళ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
తెలంగాణలో ఈ ఏడాది వేసవి సెలవుల్ని పొడిగించే అవకాశం లేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పేసింది. ఈ విద్యాసంవత్సరం వచ్చే సోమవారం , అంటే జూన్ 12 న యథావిధిగా ప్రారంభమవుతుందని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దీంతో వేసవి సెలవుల పొడగింపుపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పడినట్లయింది. రాష్ట్రంలో వేసవి పరిస్దితులు ఇంకా పూర్తిగా తగ్గకపోయినా వచ్చేవారం రుతుపవనాలు రాష్ట్రంలోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రాష్టంలో వేసవి పరిస్దితుల్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగించాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్ధులతో పాటు తల్లితండ్రులు ఈ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం వేసవి ప్రతాపం వచ్చే వారం తగ్గుముఖం పట్టే అవకాశముందని అంచనా వేస్తోంది.
అందుకే సెలవుల పొడిగింపు లేదని తేల్చిచెప్పేసింది. దీంతో విద్యార్ధులు కచ్చితంగా జూన్ 12న పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు, పాఠశాల సిబ్బందికి ఆదేశాలు పంపినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications