హైదరాబాద్, బైంసాలో శ్రీరామనవమి శోభయాత్ర నిర్వహణకు హైకోర్టు అనుమతి: షరతులు
హైదరాబాద్: శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రను హైదరాబాద్, బైంసాలో పోలీసుల మార్గదర్శకాల మేరకు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. షరతులతో కూడిన అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలీసులు అనుమతిచ్చిన వీధుల్లోనే శోభయాత్ర జరపాలని నిర్వాహకులకు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

హైదరాబాద్, భైంసాలో శోభయాత్ర నిర్వహణకు హైకోర్టు అనుమతి
హైదరాబాద్, నిర్మల్ జిల్లా బైంసాలో కొన్ని నిర్దేశిత ప్రాంతాల్లో శోభాయాత్రకు అనుమతించడం లేదంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. శాంతిభద్రతల దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రాంతాలు, వీధుల్లో శోభయాత్రకు అనుమతిచ్చినట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్, భైంసాలో శోభయాత్ర నిర్వహించుకోవచ్చని తెలిపారు. అయితే, పలు షరతులు విధించారు.

హైదరాబాద్‌లో శోభయాత్ర ఈ మార్గాల్లో కొనసాగనుంది..
హైదరాబాద్ నగరంలో సీతారాంబాగ్ ఆలయం నుంచి సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయమాశాల వరకు శోభయాత్ర నిర్వహించుకోవచ్చునని తెలిపింది. బోయిగూడ కమాన్, మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ రోడ్డు, ధూల్‌పేట, పురానాఫూల్, జుమేరాత్ బజార్, సిద్ది అంబర్ బజార్, చుడీబజార్, బేగంబజార్ ఛత్రి, శంకర్ షేర్ హోటల్, గౌలిగూడ చమన్, గురుద్వార, పుత్లిబౌలి చౌరస్తా మీదుగా సుల్తాన్ బజార్ చేరుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.
శోభయాత్రలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ఘటనలు జరిగిన కేసులు నమోదు చేయాలని హైకోర్టు సూచించింది. 2021లో జరిగిన గొడవల కేసులో ముద్దాయిగా ఉన్నవారు పోలీస్ స్టేషన్ సమక్షంలో ఉండాలని ఉండాలని హైకోర్టు పేర్కొంది.

భైంసాలో నిర్దేశిత మార్గాల్లో శోభయాత్ర
బైంసాలో గోపాలదాస్ హనుమాన్ ఆలయం, పాత సోనా చాందినీ, కుబేర్ అడ్డా, బస్టాండ్, నిర్మల్ చౌరస్తా, రాంలీలా మైదాన్ మీదుగా ఊరేగింపు నిర్వహించుకోవచ్చునని హైకోర్టు పేర్కొంది. బైంసాలో గతంలో పలు సందర్బాల్లో ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో బైంసాను అత్యంత సున్నితమైన ప్రాంతంగా పరిగణించిన పోలీసులు శోభాయాత్రకు అనుమతివ్వలేదు. దీంతో హిందూ వాహిని సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు శోభయాత్రకు షరతులతో కూడిన అనుమతిచ్చింది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ?












Click it and Unblock the Notifications