TS Polls: అక్బరుద్దీన్ పై బుల్ డోజర్ యాక్షన్-బీజేపీ వార్నింగ్- పోలీసు అధికారికి బెదిరింపులపై..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంటోంది. మరో వారం రోజుల్లో ఎన్నికల పోలింగ్ ఉండటంతో రాజకీయ పార్టీలు తమ ప్రచారాల్ని ముమ్మరం చేస్తున్నాయి. ఇదే క్రమంలో హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఓ ఘటన చోటు చేసుకుంది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ బహిరంగంగా ఓ పోలీసు అధికారిని బెదిరించారు. తాను ప్రసంగిస్తుండగా అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఫైర్ అయ్యారు. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.

నిన్న రాత్రి పాతబస్తీలో అక్బరుద్దీన్ ఓ ఎన్నికల సభలో పాల్గొన్నారు. ఈ మీటింగ్ రాత్రి వరకూ సాగింది. దీంతో ఎన్నికల కోడ్ ప్రకారం సమయం మించిపోతున్నందున అక్బరుద్దీన్ ప్రసంగాన్ని ఆపాలని స్ధానిక పోలీసు ఇన్‌స్పెక్టర్‌ కోరారు. దీంతో అక్బరుద్దీన్ ఒవైసీ ఒక్కసారిగా ఆయనపై ఫైర్ అయ్యారు. తాను ఇంకా మాట్లాడతానని, ఎవరూ తనను అడ్డుకునే ధైర్యం చేయలేరని స్పష్టం చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. తన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సదరు పోలీసు ఇన్ స్పెక్టర్ వద్దకు వచ్చిన అక్బరుద్దీన్ ఓవైసీ.. ఆయన వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత తిరిగి మైక్ దగ్గరకు వచ్చి తనను ఇక మాట్లాడకుండా ఆపగల వారెవరూ పుట్టరు అని హెచ్చరించారు.

TS Polls: bjp warns buldozer action against akbaruddin owaisi, who threatens cop in campain

ఓవైసీ బెదిరింపులపై బీజేపీ మండిపడింది. ఎంఐఎం చర్యలకు బీజేపీ ప్రభుత్వం వస్తే బుల్డోజర్ రియాక్షన్ తప్పదని ఓ ట్వీట్ లో హెచ్చరించింది. "దశాబ్దాలుగా, కాంగ్రెస్ & బీఆర్ఎస్ మద్దతుతో, ఎంఐఎం ఒక నేర సంస్థగా మారిందని, ఇది పాత నగరాన్ని నిర్వీర్యం చేసిందని తెలిపింది. అలాగే నేరాల బారిన పడకుండా చేసిందని వెల్లడించింది. ఉద్దేశపూర్వకంగా సృష్టించబడిన ఈ గజిబిజిని శుభ్రం చేయడానికి ఇది సమయం అని తెలిపింది. బిజెపి ప్రభుత్వంలో, అక్బరుద్దీన్ చర్యకు బుల్డోజర్ ప్రతిచర్య ఉంటుందని బీజేపీ తెలంగాణ ట్వీట్ చేసింది.

తెలంగాణ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తుందని భావించిన బీజేపీ తాజా సర్వేల్లో వెనుకబడటంతో కనీసం హైదరాబాద్ లో అయినా సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో తమ చిరకాల ప్రత్యర్ధులైన ఓవైసీలు ఎక్కడ దొరుకుతారా అని ఎదురుచూస్తోంది. ఇప్పుడు ఓవైసీ పోలీసుల్ని బెదిరిస్తూ వీడియోకు చిక్కడంతో బీజేపీ శ్రేణులు దీన్ని వైరల్ చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+