TS Polls: గ్రేటర్ లో నేడు రాహుల్, ప్రియాంక ప్రచారం-టార్గెట్ ఎంఐఎం-బీఆర్ఎస్..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చరమాంకానికి చేరింది. ఇవాళ సాయంత్రం 5 గంటలతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి తెరపడబోతోంది. దీంతో చివరి రోజు ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీల నేతలు నియోజకవర్గాల్ని చుట్టేస్తున్నారు. ఇదే క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లో ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా ప్రచారం నిర్వహించనున్నారు. బీఆర్ఎస్-ఎంఐఎం గుప్పిట్లో ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రచారం వీరు నిర్వహిస్తారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, నాంపల్లి, మల్కాజ్ గిరి నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించబోతున్నారు. జుబ్లీహిల్స్, నాంపల్లి సీట్లలో ఎంఐఎం నుంచి కాంగ్రెస్ గట్టిపోటీ ఎదుర్కొంటోంది. అలాగే జుబ్లీహిల్స్ బీఆర్ఎస్ సిట్టింగ్ స్ధానం కూడా. దీంతో ఈ రెండు సీట్లను గెల్చుకోవడం కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈసారి ఈ రెండు సీట్లను గెల్చుకుని బీఆర్ఎస్-ఎంఐఎం కూటమికి గట్టిదెబ్బ కొట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.

దీంతో రాహుల్ గాంధీ ఇవాళ జూబ్లీహిల్స్, నాంపల్లితో పాటు బీఆర్ఎస్ సిట్టింగ్ స్ధానమైన మల్కాజ్ గిరిలోనూ రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహించబోతున్నారు. అలాగే ఆయన సోదరి ప్రియాంక వాద్రా కూడా ఓటర్లతో ఇప్పటికే మమేకం అవుతున్నారు. ఇవాళ జహీరాబాద్ లో ప్రచారం ముగించుకుని మల్కాజ్ గిరికి రానున్న ప్రియాంక.. అక్కడ రోడ్ షో నిర్వహించి ప్రచారాన్ని ముగించబోతున్నారు. దీంతో ఇవాళ అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ఇవాళ గ్రేటర్ లోనే ప్రచారం ముగించబోతున్నారు.
ఇవాళ రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో మూడు ప్రాంతాల్లో రోడ్ షో, కార్నర్ మీటింగ్స్ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్ లోనూ, 12 గంటలకు నాంపల్లి లోనూ, మధ్యాహ్నం 2 గంటలకు మల్కాజ్‌గిరి నియోజకవర్గాల్లో రాహుల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అలాగే ప్రియాంక గాంధీ జహీరాబాద్ ఉదయం ప్రచారం ముగించుకుని మధ్యాహ్నం నుంచి మల్కాజ్ గిరి నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొంటారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications