TS Polls: గ్రేటర్ హైదరాబాద్ ఓటర్ల మొగ్గు ఎటు ? తాజా పరిస్దితి ఇదేనా !
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికంటే రాష్టమంతా ఓ ఎత్తు గ్రేటర్ హైదరాబాద్ పరిధి ఓ ఎత్తు అన్నట్లుగానే ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలోని 119 సీట్లలో 24 ఇక్కడే ఉన్నాయి. దాదాపు కోటి మంది ఓటర్లు జీహెచ్ఎంసీ పరిధిలోని సీట్లలో ఫలితాలను నిర్ణయిస్తారు. ఇందులో ఈసారి ఏం జరగబోతోందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ బలంగా ఉండటం, ఎంఐఎం తన సీట్లు తాను కచ్చితంగా గెలిచే పరిస్ధితులు ఉండేవి. కానీ ఈసారి మాత్రం సీన్ మారేలా కనిపిస్తోంది.
జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 24 నియోజకవర్గాల్లో ఓ 9 సీట్లలో మాత్రం ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంది. మిగిలిన 15 నియోజకవర్గాల్లో ప్రధానంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది.అలాగే గ్రేటర్ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో మైనార్టీలైన ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు ఇక్కడి ఓటర్లలో దాదాపు మూడింట ఒక వంతు మంది ఉన్నారు. దీంతో ఈసారి వీరి మొగ్గు ఎటు అన్నది ఉత్కంఠ రేపుతోంది.

గ్రేటర్ పరిధిలో ఉన్న 24 సీట్లలో బీఆర్ఎస్, ఎంఐఎంకు కలిపి 23 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో స్ధానం గోషామహల్లో మాత్రం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు. ఈసారి గోషా మహల్ తో పాటు మరిన్ని స్ధానాల్లో గెలిచేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అలాగే కాంగ్రెస్ గ్రేటర్ పరిధిలో ఈసారి ఖాతా తెరిచి పునర్ వైభవం తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో పలు చోట్ల త్రిముఖ, చతుర్ముఖ పోటీ నెలకొంది.
గతంలో జమిలి ఎన్నికలు జరిగిన 2014లో గ్రేటర్ పరిధిలో మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెల్చుకున్న బీఆర్ఎస్ ఆ తర్వాత జీహెచ్ఎంసీకి జరిగిన 2016, 2020 ఎన్నికల్లో పట్టు పెంచుకుని కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కంటే ఆధిపత్యం తెచ్చుకుంది.ఎంఐఎం కూడా హైదరాబాద్ ఎంపీ సీటు పరిధిలోని 7 సీట్లలో ఆధిక్యం కొనసాగిస్తోంది. కానీ ఈసారి మాత్రం ఈ సమీకరణాలన్నీ మారిపోయేలా ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో వీస్తున్న కాంగ్రెస్ గాలి గ్రేటర్ పరిధిలోనూ బీఆర్ఎస్ ఓట్లకు గండి కొట్టేలా ఉంది.

ప్రస్తుతం గ్రేటర్ లో పటాన్‌చెరు, కుతుబుల్లాపూర్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ముషీరాబాద్, అంబర్‌పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, సికింద్రాబాద్‌లలో బీఆర్‌ఎస్ కు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఎంతమంది తిరిగి గెలుస్తారో కచ్చితంగా చెప్పలేని పరిస్దితి. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ మల్కాజిగిరి, ఉప్పల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లలో కొత్త ముఖాలను రంగంలోకి దించింది. ఎంఐఎం కూడా తన పరిధిని దాటి జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ లో కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చింది.
అటు కాంగ్రెస్ కూడా మాజీ ఎంపీలు మధు యాష్కీ గౌడ్ (ఎల్‌బి నగర్), అంజన్ కుమార్ యాదవ్ (ముషీరాబాద్), మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మా రెడ్డి (మహేశ్వరం), ఇద్దరు జిహెచ్‌ఎంసి కార్పొరేటర్లు వి జగదీశ్వర్ గౌడ్ (శేరిలింగంపల్లి), పి విజయారెడ్డి (ఖైరతాబాద్)కి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది. అలాగే బీజేపీ తరపున మాజీ ఎమ్మెల్యేలు టీ నందీశ్వర్ గౌడ్ (పటాన్చెరు), కూన శ్రీశైలం గౌడ్ (కుతుబుల్లాపూర్), ఎన్వీఎస్ ఎస్ ప్రభాకర్ (ఉప్పల్), సీ కృష్ణ యాదవ్ (అంబర్‌పేట్), చింతల రామచంద్రారెడ్డి (ఖైరతాబాద్), మర్రి శశిధర్ రెడ్డి (సనత్‌నగర్), మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచంద్రరావు (మల్కాజిగిరి) పోటీలో ఉన్నారు. దీంతో గ్రేటర్ పరిధిలో ఆసక్తికర పోరు నెలకొంది.
గతంతో పోలిస్తే ఈసారి రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకత గ్రేటర్ పైనా ప్రభావం చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్-ఎంఐఎం కూటమి సీట్లలో కాంగ్రెస్ ఎంక్కువగా పాగా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో మలక్ పేట, నాంపల్లి సీట్లను ఎంఐఎం నుంచి కాంగ్రెస్ చేజిక్కించుకోవడం ఖాయమని తెలుస్తోంది. అలాగే శివారు నియోజకవర్గాల్లో సెటిలర్ల ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లడంతో అక్కడా బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలు తప్పేలా లేవు. బీజేపీ మరోసారి గోషా మహల్ గెలవడం లేదా బీఆర్ఎస్ కు కోల్పోయే అవకాశాలూ లేకపోలేదు.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఆస్తి పన్ను కట్టండి.. 90 శాతం వడ్డీ రాయితీ పొందండి! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్












Click it and Unblock the Notifications