TS Ministers: కేసీఆర్ కేబినెట్లో గెలిచిన మంత్రులు, ఓడిన మంత్రులు వీరే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై క్లారిటీ వచ్చేసింది. రేపో మాపో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏర్పాటు కాబోతోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా వీచిన కాంగ్రెస్ గాలిలో పలువురు బీఆర్ఎస్ మంత్రులు ఓటమిపాలయ్యారు. మరికొందరు మంత్రులు ఎదురీతలోనూ గెలిచారు. సీఎం కేసీఆర్ స్వయంగా కామారెడ్డి నియోజకవర్గంలో ఓడిపోయారు. దీంతో తెలంగాణలో గెలిచిన, ఓడిపోయిన మంత్రులపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

కేసీఆర్ కేబినెట్లోని బీఆర్ఎస్ మంత్రుల్లో గెలిచిన వారిలో ఆయన(గజ్వేల్)తో పాటు తనయుడు కేటీఆర్(సిరిసిల్ల), మేనల్లుడు హరీష్ రావు(సిద్ధిపేట), సబితా ఇంద్రారెడ్డి( చేవెళ్ల), ప్రశాంత్ రెడ్డి (బాల్గొండ), జగదీశ్ రెడ్డి(సూర్యాపేట), గంగుల కమలాకర్ (కరీంనగర్) ఉన్నారు. వీరంతా కాంగ్రెస్ గాలిని తట్టుకుని ఈ ఎన్నికల్లో గెలుపొందారు. అయితే మరికొందరు మంత్రులు మాత్రం ఈసారి ఓటమి పాలయ్యారు.
ఈసారి తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయిన మంత్రుల్లో నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ వంటి వారు ఉన్నారు. వీరంతా కాంగ్రెస్ గాలిలో ఓటమిపాలవ్వక తప్పలేదు. గతంలో పలుమార్లు గెలిచి మంత్రులుగా పనిచేసిన చరిత్ర ఉన్న వీరంతా ఈసారి మాత్రం కాంగ్రెస్ హవాలో కొట్టుకుపోయారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో వీరు మాజీలుగా నిలిచిపోనున్నారు.
మరోవైపు సీఎం కేసీఆర్ కూడా కామారెడ్డి నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి, బీజేపీ అభ్యర్ధి కటిపల్లి వెంకట రమణారెడ్డితో పోటీ పడిన కేసీఆర్ రెండో స్ధానంలో నిలిచారు. ఇక్కడ స్ధానికుడైన బీజేపీ అభ్యర్ధి వెంకట రమణారెడ్డిపైనే ఓటర్లు నమ్మకం ఉంచారు. దీంతో కేసీఆర్ రెండో స్ధానంలోనూ, రేవంత్ రెడ్డి మూడో స్ధానంలోనూ నిలిచి ఓటమి పాలయ్యారు.












Click it and Unblock the Notifications