గ్రూప్స్ పరీక్షల సిలబస్‌ను విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ
హైదరాబాద్: గ్రూప్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం టీఎస్‌పీఎస్సీ సిలబస్‌ను విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న గ్రూప్స్ నూతన సిలబస్‌ను టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఆచార్య హరగోపాల్ సోమవారం ఆవిష్కరించారు.
90 మంది అధ్యాపకులు నెలపాటు శ్రమించి సిలబస్ తయారు చేశారని సిలబస్ విడుదల సందర్భంగా ప్రొ.ఘంటా చక్రపాణి తెలిపారు. జులై 27న ప్రభుత్వం స్కీంను ఆమోదించిందిని వెల్లడించారు.

సిలబస్‌లో గ్రూప్ 1,2,3,4 సహా గెజిటెడ్, నాన్ గెజిటెడ్ విభాగాలకు సిలబస్ పూర్తిస్థాయిలో తయారుచేసినట్లు చెప్పారు. సిలబస్ తక్షణం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. నోటిఫికేషన్ వచ్చే లోపే అభ్యర్థులు ప్రిపేర్ కావోచ్చని ఆయన సూచించారు.
సిలబస్ రూపొందించిన మేధావులకు, ప్రొఫేసర్లకు ధన్యవాదాలు తెలిపారు. సిలబస్ కమిటీలో ఉన్న 32 మంది సభ్యులకు టీఎస్‌పీఎస్సీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. సిలబస్‌లో తెలంగాణ చరిత్ర పొందుపర్చామన్నారు.












Click it and Unblock the Notifications