టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు: ఏకంగా ఒకేసారి 19 మంది అరెస్ట్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఒకేసారి పెద్ద సంఖ్యలో అరెస్టులు నమోదయ్యాయి. ఈ కేసులో ఏకంగా 19 మందిని సిట్ అధికారులు ఒకేసారి అరెస్టు చేశారు. తాజా అరెస్టులతో ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య 74కు చేరింది. నిందితుడు పోల రమేష్ ఏఈ ప్రశ్నాపత్రం ఇవ్వడం కోసం.. ఒక్కొక్కరి వద్ద 2 నుంచి 5 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు.

రమేష్ వ్యవహారంలో లోతుగా విచారణ కొనసాగిస్తున్న అధికారులు వరుసగా నిందితులను అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా అరెస్టైన నిందితుల్లో డి. శివకుమార్, ఎం. నాగరాజు, పి. సురేందర్, హరికృష్ణ, ధరావత్ రాజేష్, జెన్నాయుల అశోక్, ధరావత్ కళ్యాణ్, బానోత్ నాగరాజు, తోట విజయకుమార్, గడ్డం అజయ్ కుమార్, మాలోతు సునీల్, కోడి సంతోష్, మర్క రాములు సహా మరో ఆరుగురు ఉన్నారు.

 TSPSC paper leakage

గతంలో హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడి అరెస్టైన ఏఈ పోల రమేష్ నుంచి సేకరించిన సమాచారం, సెల్‌ఫోన్లోని కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు.. ఏఈ పరీక్షలో 16వ ర్యాంక్ సాధించిన నాగరాజును సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని కూడా త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

మున్సిపల్ ఏఈ పరీక్ష ప్రశ్నాపత్రాన్ని పోల రమేష్ నుంచి కొనుగోలు చేసేందుకు నాగరాజు 30 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముందుగా కొంత మొత్తాన్ని రమేష్‌కు బదిలీ చేశాడు. ఆ తర్వాత పరీక్ష రాసిన నాగరాజు.. 16వ ర్యాంక్ సాధించాడు. దర్యాప్తులో భాగంగా నాగరాజు కోసం రామాపురం వెళ్లిన సిట్ అధికారులు అతడ్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

కాగా, ప్రస్తుతం పోల రమేష్ కేంద్రంగా దర్యాప్తు కొనసాగుతోంది. పోల రమేష్ ఇప్పటికే ఏడుగురికి ఏఈఈ, డీఏవో పరీక్ష కోసం హైటెక్ పద్ధతిలో మాస్ కాపీయింగ్ చేశాడు. పరీక్ష కేంద్రాల యాజమాన్యం, అధ్యాపకుల సహకారంతో జవాబులను మైక్రో ఎలక్ట్రానిక్ డివైజ్‌లను ఉపయోగించి ఒప్పందం చేసుకున్న అభ్యర్థులకు అందించాడు. మరోవైపు, ఏఈ ప్రశ్నాపత్రాలను లక్షల రూపాయలకు విక్రయించాడు.

ఇక టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడైన ప్రవీణ్ తన వద్దకు ఏఈ పేపర్ రాగానే దాన్ని విక్రయించాలని తన స్నేహితుడు సురేష్‌కు చెప్పాడు. సురేష్‌కు బంధువైన పోల రమేష్ కు ఈ విషయం చెప్పగానే.. తాను విక్రయిస్తానంటూ ఆ ప్రశ్నాపత్రాలను తీసుకున్నాడు. ఆ తర్వాత పేపర్లు విక్రయిస్తూ.. భారీ మొత్తంలో డబ్బులు పొందాడు.

గతంలోనే రమేష్ 30 మందికి పేపర్ విక్రయించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే రమేష్ వద్ద ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేస్తూ వస్తున్నారు. మరో 30 మంది నిందితులను జులై నెలాఖరులోగా అరెస్ట్ చేసే అవకావం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, మంగళవారం మరో ముగ్గురు నిందితులను సిట్ అధికారులు అరెస్ట్ చేయడంతో మొత్తం అరెస్టుల సంఖ్య 77కి చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+