టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ల లీకేజీలో మరికొందరి హస్తం: తీగ లాగుతున్న సిట్!!
టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీలో మరికొందరి హస్తం ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా గ్రూప్ వన్ పరీక్ష పేపర్ లీకేజ్ లో ఉన్న వారిని విచారించటానికి కావాల్సిన అన్ని ఆధారాలని సేకరిస్తుంది సిట్.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ల లీకేజీ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో దుమారంగా మారుతున్న విషయం తెలిసిందే. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్ వ్యవహారంలో తీగలాగితే డొంక కదులుతోంది. ప్రశ్నాపత్రాల లీకేజీ లో ఒకవైపు సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు నిందితుల ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్ లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో నిందితులను దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఈ వ్యవహారంలో మరికొందరి పాత్ర ఉన్నట్టుగా గుర్తించిన సిట్ అధికారులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి కావలసిన ఆధారాలను సేకరిస్తున్నారు.
టౌన్ ప్లానింగ్ పరీక్ష పేపర్ తో మొదలైన లీకేజీ ప్రభావం, గత అక్టోబర్ నుండి నిర్వహించిన అన్ని పరీక్షల పైన పడింది. దీంతో ఇప్పటికే గత అక్టోబర్ నుంచి నిర్వహించిన ఏడు పరీక్షలలో నాలుగు పరీక్షలను టిఎస్పిఎస్సి రద్దు చేసింది. గత అక్టోబర్ లోనే నిందితుడు రాజశేఖర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల పేపర్లను భద్రపరిచిన కంప్యూటర్లను యాక్సిస్ చేయడంతో గ్రూప్ వన్ పరీక్ష పేపర్లు కూడా లీక్ అయినట్టు సిట్అధికారులు నిర్ధారణకు వచ్చారు. దీంతో గ్రూప్ వన్ పరీక్షను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
గ్రూప్ వన్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం నేపథ్యంలో అసలు ఈ ప్రశ్న ప్రకారం లీకేజీ ఎలా జరిగింది? ఈ లీకేజ్ ద్వారా లబ్ధి పొందిన అభ్యర్థులు ఎవరు? అన్నది సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. దీనికోసం ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ఫోన్లలో అక్టోబర్ నుండి ఉన్న వాట్సప్ చాటింగ్ ల వివరాలను తెప్పించుకొని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వీరిద్దరూ గత ఆరు నెలలుగా ఎవరెవరితో సంప్రదింపులు జరిపారు? గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారు ఎవరు? వంద మార్కులకు పైగా సాధించిన వారి జాబితాను సిద్ధం చేసి అందులో అనుమానితులు ఎవరు అన్నది పరిశీలించి, వారిని కూడా విచారించాలని భావిస్తున్నారు.

అభ్యర్థుల బ్యాంకు లావాదేవీలను సైతం పరిశీలిస్తున్నారు. ఇక ఈ జాబితాలో కొందరు విదేశాలలో ఉన్న అభ్యర్థులు కూడా ఉన్నారని, వారు నిందితులతో టచ్ లో ఉండి పరీక్షల సమయంలో వచ్చి పరీక్షలు రాసి వెళ్లారని గుర్తించారు. అలా కొందరు పరీక్షలలో అర్హతను సాధించారని గుర్తించిన అధికారులు వారిని సంప్రదించే ప్రయత్నం చేయగా చాలామంది ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చినట్టుగా సమాచారం. ఇక పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత, ఎవరెవరు ఇందులో కీలక భూమిక పోషించారు. ప్రశ్నాపత్రాలను లీకేజ్ చేసిన నిందితులతో పాటుగా, డబ్బులు ఇచ్చి ప్రశ్నాపత్రాలను కొనుగోలు చేసిన అభ్యర్థులపై కూడా కేసు నమోదు చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం.

ఇక ఇప్పటికే ఈ వ్యవహారంలో హిమాయత్ నగర్ సిట్ కార్యాలయంలో ఆదివారం నాడు 9 మందిని వేరువేరుగా విచారించిన సిట్ అధికార బృందం, ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఎంతమంది ఉన్నారు అన్నది కూపీ లాగుతుంది. త్వరలో పూర్తిగా ఈ వ్యవహారంపై స్పష్టత వచ్చిన తర్వాత దీని వెనుక ఉన్న ప్రతి ఒక్కరిపై కేసులు పెట్టి, కఠిన చర్యలు తీసుకోవడానికి సిట్ రెడీ అవుతుంది. మరోవైపు ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపటంతో ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్ గా దృష్టి సారించింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications