Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉచిత బస్సు ప్రయాణమే కాదు మరో సూపర్ వార్త చెప్పిన తెలంగాణా ఆర్టీసీ!

కొత్త సంవత్సరంలో తెలంగాణ ఆర్టీసీ తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పింది. హైదరాబాద్లో ఆర్టీసీ కనెక్టివిటీ పెంపొందించడానికి త్వరలోనే 370 కొత్త బస్సులను ప్రవేశపెడుతున్నట్టు పేర్కొంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు ఈ విషయాన్ని వెల్లడించారు. నగరంలోని శివారు ప్రాంతాలు, పెరుగుతున్న ఐటీ కారిడార్ లకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందించడం లక్ష్యంగా ఈ కొత్త బస్సులను ప్రవేశపెడుతున్నట్టు ఆయన తెలిపారు.

నగర శివారులో 370 కొత్త మార్గాలను గుర్తించిన ఆర్టీసీ
నగరంలోని అనేక శివారు ప్రాంతాలలో బస్సు సేవలు తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, అటువంటి ప్రాంతాలలో ఈ బస్సులు ఆ లోపాన్ని పూర్తిస్థాయిలో తొలగిస్తాయి అని చెప్తున్నారు. అధికారులు ఇప్పటికే అవసరమైన 370 కొత్త మార్గాలను గుర్తించారని, ఈ రూట్లో లోని బస్సులను నడపనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

TSRTC Announces 370 New Buses in Hyderabad New Year Good News for Telangana

మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన
ఖైరతాబాద్ లో జరిగిన జాతీయ రహదారి భద్రత మహోత్సవాల ప్రారంభోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ప్రకటన చేశారు. జనవరి ఒకటవ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు జరిగే మహోత్సవాలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాష్ట్రంలో ప్రజా రవాణాను భవిష్యత్తులో మరింత మెరుగు పరుస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ లు రద్దు చేస్తాం
అతివేగం, ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, తప్పు మార్గాలలో ప్రయాణించడం ప్రమాదాలకు దారితీస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తామని డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేశారు. ఇక విద్యార్థులలో అవగాహన కల్పించడం కోసం పాఠశాలలలో ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులను ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

ప్రజలు స్వచ్చందంగా నిబంధనలు పాటించాలి
రాష్ట్రంలో కోటి 80 లక్షల వాహనాలను వెయ్యి మంది అధికారులతో నియంత్రించడం అసాధ్యం అని పేర్కొన్న మంత్రి, ప్రజలు స్వచ్ఛందంగా నిబంధనలు పాటించాలని సూచించారు. ట్రాఫిక్ సెన్స్ ఉన్నప్పుడే ప్రమాదాలను నివారించగలుగుతాం అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+