శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు - దర్శనంతో సహా ప్యాకేజీలు..!!
పవిత్ర కార్తీక మాసం వేళ టీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. ఈ మాసంలో భక్తుల కోసం శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. వేములవాడ, కాళేశ్వరం, రామప్పగుడి, వెయ్యి స్తంభాల గుడి, పాలకుర్తి తదితర శివాలయాలకు బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ప్రతి ఆదివారం, కార్తిక పౌర్ణమి ముందురోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి బయలు దేరుతాయని చెప్పారు. మళ్లీ దర్శనం అనంతరం సోమవారం రాత్రికి రాజధానికి చేరుకుంటాయని తెలిపారు.
తెలంగాణలోని వేములవాడ, రామప్ప, వేయి స్తంభాల గుడి, పాలకుర్తి తదితర దక్కన్ పంచశైవ క్షేత్రాలకు బస్సులు నడుపుతోంది. ప్రతి ఆదివారం, కార్తీక పౌర్ణమి ముందురోజు మధ్యాహ్నం 2 గంటలకు ఈ ప్రత్యేక హైదరాబాద్ నుంచి బయలుదేరి సోమవారం రాత్రి తిరిగి నగరానికి చేరుకుంటాయి. రాజధాని బస్సుకు టికెట్ రూ. 2,400, సూపర్ లగ్జరీకి రూ. 1900, ఎక్స్‌ప్రెస్‌కు రూ. 1500గా నిర్ణయించారు. దర్శనం టికెట్లు అదనంగా ఉంటాయని అధికారులు స్పష్టం చేసారు. తెలంగాణలోని వేములవాడ, రామప్ప, వేయి స్తంభాల గుడి, పాలకుర్తి తదితర దక్కన్ పంచశైవ క్షేత్రాలకు బస్సులు నడుపుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలోని పంచారామ క్షేత్రాలకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసింది. ప్రతి ఆదివారంతోపాటు పౌర్ణమి ముందు రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ నుంచి బస్సులు బయలుదేరుతాయి. మంగళవారం మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ చేరుకుంటాయి.
#కార్తీక_మాసంలో భక్తుల సౌకర్యార్థం #ఖమ్మం రీజియన్ నుండి ప్రత్యేక బస్సులు
— RM KHAMMAM TSRTC (@Rmkmmtsrtc) November 8, 2023
ఈ కార్తీకమాసంలో ప్రతి #ఆదివారం రాత్రి బయలుదేరి #సోమవారం నాడు పవిత్ర #పంచారామాలను దర్శించుకోబడును @TSRTCHQ @tsrtcmdoffice @TSRTCCTMMNC pic.twitter.com/hFdVzKviZ0
రాజధాని బస్సుల్లో టికెట్ రూ. 4 వేలుగా, సూపర్ లగ్జరీ బస్సుకు రూ. 3,200గా నిర్ణయించారు. దర్శనం, వసతి కోసం అదనంగా రూ. 550 చెల్లించాల్సి ఉంటుంది. ప్రతీ ఏటా కార్తీక మాసం అనేక ప్రాంతాల నుంచి ఈ శైవ క్షేత్రాల సందర్శన కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. దీంతో, భక్తుల డిమాండ్ ను పరిగణలోకి తీసుకొని ఈ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications