ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కారు: ఇద్దరికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
పెద్దపల్లి: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయాణికుస్తున్న కారు.. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ధర్మారం క్రాస్ రోడ్డు వద్ద శనివారం రాత్రి ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో సజ్జనార్ కు చిన్నగాయంతో తప్పించుకున్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రామగుండం మండలం మల్యాలపల్లికి చెందిన ఎగ్గు నాగరాజు(38), అతని భార్య లక్ష్మి, అంతర్గాం మండలం రాయదండికి చెందిన నూనె భూమయ్య, నూనె లక్ష్మి వారి సొంత ఆటోలో కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువులను పరామర్శించి రామగుండంకు తిరుగు పయనమయ్యారు.

అదే సమయంలో ధర్మారం క్రాస్ రోడ్డు వద్దకు రాగానే వీరి ఆటోను వెనుక నుంచి వచ్చిన సజ్జనార్ కారు బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నాగరాజు, లక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి. భూమయ్య, నూనె లక్ష్మికి చిన్న గాయాలతో బయటపడ్డారు. వారిని హైవే అంబులెన్స్ ద్వారా పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో సజ్జనార్ కుడి చేతికి స్వల్ప గాయమైంది. ఆటో ఒక్కసారిగా అడ్డు రావడంతోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. బాధితుల వివరాలను తెలుసుకున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications