హరీశ్ రావుకు చేదు అనుభవం.. మంత్రిని తాకిన ఆర్టీసీ సెగ..!
సంగారెడ్డి : తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారం నాటితో 30వ రోజుకు చేరింది. ఆ క్రమంలో ప్రభుత్వం మెట్టు దిగి రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఎక్కడికక్కడ ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పడుతున్నారు. కొన్ని చోట్ల ఆత్మహత్యలు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి.
దాదాపు నెల రోజుల నుంచి సమ్మె జరుగుతున్నా.. సీఎం కేసీఆర్ మొండి వైఖరి అవలంభించడం సరికాదని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు మండిపడుతున్నారు. ఆ క్రమంలో మంత్రులెవరూ ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడకపోవడం కూడా వారికి మరింత ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావుకు చేదు అనుభవం ఎదురైంది.

స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ హరీశ్ రావుకు ఆర్టీసీ సమ్మె సెగ తగిలింది. హైదరాబాద్ శివారులోని బీరంగూడలో జరిగిన బైక్ ర్యాలీలో పాల్గొనడానికి అక్కడకు వెళ్లారు హరీశ్ రావు. ఆ సమయంలో ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆర్టీసీ కార్మికులు. దాంతో కొద్దిసేపు అక్కడ టెన్షన్ వాతావరణం కనిపించింది. మంత్రిని అడ్డుకుంటున్నారనే నెపంతో కొందరు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరోవైపు బీహెచ్ఈఎల్ డిపో దగ్గర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications