TSRTC: టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. అందుబాటులోకి డైనమిక్ ధరలు..!

దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ఆర్టీసీ(TSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. డిమాండ్ బట్టి ఆన్ లైన్ టికెట్ ధర ఉంటుందని గురువారం పేర్కొంది. ఆన్ లైన్ టికెట్ ధర అనేది విండో సీట్, లెగ్ రూమ్ వంటి సీట్ల, ట్రాఫిక్, డిమాండ్ ఆధారంగా టికెట్ ధరలు మారుతుంటాయని తెలిపింది. తక్కువ రద్దీ ఉంటే టికెట్ల ధర సాధారణంగా ఉంటుంది. ఎక్కువ రద్దీ ఉంటే టికెట్ల ధర పెరగనుంది. దసరా, బతుకమ్మ, సంక్రాంతి, దీపావళి పండుగలకు రద్దీ ఉంటుంది. అప్పుడు టికెట్ల ధర పెరుగుతుంది.

హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం నుంచి బెంగళూరు వెళ్ల 46 సర్వీసులకు ఈ నిబంధన మార్చి 27 నుంచి డైనమిక్ ధరలు అందుబాటులోకి రానున్నాయి. ఈ డైనమిక్ ధరలను పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మొదటగా బెంగళూరు వెళ్లే గరుడ, లగ్జరీల్లో బస్సుల్లో అమలు చేయనున్నట్లు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి తెలిపారు. టికెట్ ధర లు ప్రయాణికులు ఎంచుకున్న సీట్ల డిమాండ్, సీట్ల ఎంపికపై ఆధారంగా నిర్ణయిస్తారని చెప్పారు.

TSRTC Will Impliment from 27 March dynamic pricing for online bus tickets

ప్రైవేట్ బస్సులు, హోటళ్లు, విమానాలు, రైలు తత్కాల్ టికెట్లలో డైనమిక్ ధరలు ఇప్పటికే అమలు చేస్తున్నారని ఆయన చెప్పారు. డైనమిక ధరల్లో టికెట్ ధరకు గరిష్ఠ పరిమితి ఉంటుందని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ చెప్పారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు గరుడ సాధారణ బస్సు ఛార్జీ రూ.1,290 ఉన్నట్లు చెప్పారు. కనిష్ఠంగా రూ. 960 ఉంటుండగా.. గరిష్ఠంగా రూ.1,550 ఉంటుందని చెప్పారు. అంటే రద్దీ తక్కువగా ఉన్నప్పుడు రూ.960 వసూలు చేస్తారు. రద్దీ ఎక్కువగా ఉంటే రూ.1,550 వసూలు చేస్తారు.

సుపర్ లగ్జరీకి హైదరాబాద్ నుంచి బెంగళూరు సాధారణ ఛార్జీ రూ.1,000 కాగా, రద్దీ తక్కువున్నప్పుడు రూ.840, రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు రూ.1,220 ధరలు ఉంటాయన్నారు. ఆర్టీసీ తీసుకొచ్చే అన్ని కార్యక్రమాలకు ప్రజల నుంచి మద్దతు ఉందన్నారు. ప్రయాణికులకు మంచి సర్వీస్ అందించేందుకు డైనమిక్ ధరలు అందుబాటులోకి తెచ్చామన్నారు. మంగళ, బుధ, గురువాల్లో స్థిరమైన ఛార్జీలు ఉన్నయన్నారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్ అప్లికెష్న్లు డైనమిక ధరల కోసం ఉపయోగిస్తున్నామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+