Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాంగ్రెస్ లోకి తుమ్మల, సీటుపై హామీ - ముహూర్తం ఫిక్స్..!!

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరటం అధికారికంగా ఖాయమైంది. హైదరాబాద్ లో జరిగే సీడబ్ల్యూసీ సమావేశానికి పార్టీ అగ్ర నేతలు తరలి వస్తున్నారు. పార్టీ అధినాయకత్వం సమక్షంలోనే కాంగ్రెస్ కండువా కప్పుకొనేందుకు తుమ్మల నిర్ణయించారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ థాక్రే తో పాటుగా పార్టీ ముఖ్య నేతలు తుమ్మలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పార్టీలో చేరిక..సీటు పైన నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది.

టీడీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల హాయంలో మంత్రిగా పని చేసిన ఖమ్మం జిల్లా సీనియర్ నేత తుమ్మల కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఇందుకు ముహూర్తం..వేదిక ఖరారైంది. ఈ సారి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చాలా కాలంగా తుమ్మల భావిస్తున్నారు. అయితే, బీఆర్ఎస్ జాబితా ప్రకటించటం..అందుతో తన పేరు లేకపోవటంతో పార్టీ మార్పు ఆలోచన చేసారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ నేతల నుంచి వచ్చిన ఆహ్వానంతో ఆ పార్టీలో చేరికకు నిర్ణయించారు. ఆ తరువాత ఖమ్మంలో రాజకీయంగా చాలా కాలంగా ఉప్పు - నిప్పు లా ఉన్న పొంగులేటి - తుమ్మల భేటీతో జిల్లా రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. తుమ్మలను కాంగ్రెస్ లోకి రావాలంటూ పొంగులేటి ఆహ్వానం పై సానుకూల స్పందన వ్యక్తం అయింది. దీంతో, ఈ నెల 17న అధికారికంగా కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసారు.

తాజాగా తుమ్మల నివాసానికి వెళ్లిన ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ కో.చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ పార్టీలో చేరిక పైన చర్చించారు. ఈ నెల 16, 17 తేదీల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం హైదరాబాద్ లో జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు సోనియా, రాహుల్, ప్రియాంకతో పాటుగా ఖర్గే, పార్టీకి చెందని 39 మంది ముఖ్య నేతలు హైదరాబాద్ రానున్నారు. 2024 ఎన్నికలకు సంబంధించి కార్యాచరణ..పార్టీకి దిశా నిర్దేశం ఈ సమావేశం ద్వారా ఇవ్వనున్నారు. 17న హైదరాబాద్ లో జరిగే బహిరంగ సభలో సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు పార్టీ తరపున సందేశం..అధికారంలోకి వస్తే అమలు చేసే గ్యారంటీలను ప్రకటించనున్నారు.

Tummala Nageswara rao to join in congeress on 17th September in presence of Rahul Gandhi at Hyderabad

తుమ్మల పాలేరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నుంచి హామీ లభించింనా.. పార్టీలో మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉందని తెలుస్తోంది. పాలేరు నుంచి తుమ్మలను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ లోని ఒక వర్గం ప్రయత్నిస్తోంది. చాలా కాలంగా జిల్లాలో కాంగ్రెస్ కు కీలకంగా ఉన్న నేతలు మాత్రం అక్కడ నుంచి షర్మిలకు పోటీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. షర్మిల తాజాగా ఢిల్లీలో సోనియా, రాహుల్ తో భేటీ అయ్యారు. ఆ సమయంలో షర్మిలకు ఖచ్చితంగా పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు. అ ఈ క్రమంలో తుమ్మల పార్టీలో చేరినా పాలేరు సీటు విషయంలో ఏం జరుగుతుందనేది అధికారిక ప్రకటన వరకూ సస్పెన్సే. ఈ వారంలోనే షర్మిల పార్టీ విలీనం..పాలేరు సీటు పైన పార్టీ నిర్ణయం పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+