రూ. 450కోట్ల విలువైన టర్కీ కరెన్సీ సీజ్: 17మంది అరెస్ట్(ఫొటోలు)
హైదరాబాద్: నిషేధిత టర్కీ కరెన్సీ(లిరా) మార్పిడికి ప్రయత్నించిన మూడు ముఠాలను స్పెషల్ ఆపరేషన్ టీం(ఎస్‌వోటీ) పోలీసులు పట్టుకున్నారు. పంజాగుట్ట ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ ఎంవెంకటేశ్వర్లు ఆ వివరాలను వెల్లడించారు. ఎస్సార్‌నగర్ కూడలిలో విదేశీ కరెన్సీని మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఎస్సార్‌నగర్ పోలీసులు ఓ కానిస్టేబుల్‌ను పంపారు.
ఆ కానిస్టేబుల్ సమాచారంతో మూడు ముఠాలకు చెందిన 10 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. టర్కిష్‌లో 2003లో రూ.5 లక్షలు, రూ.10 లక్షల విలువైన నోట్లను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. ఆ నోట్లను కరీంనగర్‌కు చెందిన రియల్టరు గోపు రామలింగం(56), పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బల్లా హేమకుమార్(37), అమలాపురానికి చెందిన ఎం బాలవెంకటనారాయణ(27) కొనుగోలు చేశారు.

వాటిని ఇతరులకు అమ్మేందుకు పథకం వేశారు. 10 మంది 3 ముఠాలుగా విడిపోయి అమాయకులకు అమ్మేందుకు ప్రయత్నించారు. వీరి వద్ద ఉన్న మొత్తం 300 టర్కిష్ నోట్ల విలువ రూ.440 కోట్ల వరకు ఉంటుందని అంచనా. గోపు రామలింగం, ఎ శ్రీకృష్ణ, ఇజ్రాయేల్ నిస్సి, పివివి సత్యనారాయణ, డి శ్రీనివాసచారి, మహ్మద్ షావెజ్ జాఫర్, మహ్మద్ షకీల్ పాషా, బి హేమకుమార్, ఎం బాలవెంకటనారాయణ, కె రామకృష్ణను అరెస్టు చేసి 11 చరవాణులు, కారును స్వాధీనం చేసుకున్నారు.
సైబరాబాద్ ఎస్‌వోటీ అదనపు డీసీపీ రాంచంద్రారెడ్డి తెలిపిన ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన అనిల్‌కుమార్ ఏపీలోని కృష్ణ, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టీ రూప్‌చంద్ (33), పీ సత్యకుమార్ (34), కే రంజిత్‌కుమార్ (34), టీ శ్రీనివాస్‌రావు (30)ను సంప్రదించి తన దగ్గర 10 కోట్లు విలువ చేసే టర్కీ లీరా కరెన్సీ ఉందని అది మన దేశ కరెన్సీలో రూ.220 కోట్లు అవుతుందని ఈ కరెన్సీని రూ.10 కోట్లకు అమ్మేసి వాటాలు పంచుకుందామని ప్రతిపాదించాడు.

అంగీకరించిన ఆ నలుగురు మల్కాజిగిరిలో ఉంటున్న పాస్టర్ వీ కృష్ణమోహన్ (53), అతని స్నేహితులు వీరవెంకట సుబ్రహ్మణ్యం, వెంకటచలపతిరెడ్డిలతో కలిసి పలుకుబడి ఉన్న వారిని గుర్తించి వారికి అమ్మాలని ప్లాన్ చేశారు. వీరికి అనిల్‌కుమార్ 5 లక్షల డినామినేషన్‌తో కూడిన 198 టర్కీ నోట్లు ఇచ్చాడు. వీరు ఇతరులను బురిడీ కొట్టించే ప్రయత్నంలో ఉండగా ఎస్‌ఓటీ పోలీసులు వల పన్ని పట్టుకున్నారు.
-
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్‌ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్ -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!!












Click it and Unblock the Notifications