ఇదీ జరిగింది!: వదినతో గొడవపై పీఎస్‌కు నటి శ్రీవాణి, భర్త కూడా
హైదరాబాద్: బుల్లి తెర నటి శ్రీవాణి సోమవారం నాడు వికారాబాద్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఆమె తన భర్త విక్రమాదిత్య, తన లాయర్‌తో కలిసి పోలీస్ స్టేషన్ వచ్చారు. ఆమె వదిన అనూష శ్రీవాణి పైన కేసు పెట్టిన విషయం తెలిసిందే.
నటి శ్రీవాణి కోసం పోలీసుల వెయిటింగ్: అరెస్ట్ ఛాన్స్, డుమ్మా ఎందుకు?ఈ నేపథ్యంలో పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని చెప్పారు. శుక్రవారం నాడు ఆమె రాక కోసం పోలీసులు చాలా సేపు నిరీక్షించారు. కానీ ఆమె రాలేదు. శ్రీవాణి రాకుంటే ఆమె పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో సోమవారం నాడు ఆమె వికారాబాద్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. పోలీసులు ఇచ్చిన నోటీసులకు ఆమె సమాధానం చెప్పారు. అనూషతో గొడవ, ఆమె పెట్టిన కేసు, తాను ఆస్తి గురించి కొట్లాడటం లేదని ఆమె పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది.
టీవి నటి శ్రీవాణి వివాదానికి తెర: పోలీస్ స్టేషన్‌లో కుదిరిన ఒప్పందంకాగా, ఈ వివాదం ముగిసినట్లుగా వార్తలు వచ్చిన విషయం కూడా తెలిసిందే. వదిన అనూషతో పోలీసు స్టేషన్‌లో శ్రీవాణి ఒప్పందం కుదుర్చుకుంది. తన అన్న చేసిన రూ.40 లక్షల అప్పు తీర్చడానికి, వదిన అనూషకు రంగారెడ్డి జిల్లా పరిగిలో ఓ ప్లాట్ ఇవ్వడానికి శ్రీవాణి అంగీకరించింది. దాంతో వదిన అనూష కూడా వివాదానికి తెర దించడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. తన ఇంటిని కూల్చిందని ఆరోపిస్తూ అనూష శ్రీవాణిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications