టీవి నటి శ్రీవాణి వివాదానికి తెర: పోలీస్ స్టేషన్‌లో కుదిరిన ఒప్పందం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టీవీ నటి శ్రీవాణి వివాదం ఎట్టకేలకు ముగిసింది. వదిన అనూషతో పోలీసు స్టేషన్‌లో శ్రీవాణి ఒప్పందం కుదుర్చుకుంది. తన అన్న చేసిన రూ.40 లక్షల అప్పు తీర్చడానికి, వదిన అనూషకు రంగారెడ్డి జిల్లా పరిగిలో ఓ ప్లాట్ ఇవ్వడానికి శ్రీవాణి అంగీకరించింది.

దాంతో వదిన అనూష కూడా వివాదానికి తెర దించడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. తన ఇంటిని కూల్చిందని ఆరోపిస్తూ అనూష శ్రీవాణిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. శ్రీవాణి శుక్రవారం రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ పోలీసు స్టేషన్‌లో హాజరు కావాల్సి ఉండింది.

Also Read: నటి శ్రీవాణి కోసం పోలీసుల వెయిటింగ్: అరెస్ట్ ఛాన్స్, డుమ్మా ఎందుకు?

తనకు షూటింగ్ ఉందని చెబుతూ గత రెండు మూడు రోజులుగా ఆమె పోలీసు స్టేషన్‌కు రాలేదు. అనూష మాత్రం పోలీసు స్టేషన్‌కు వచ్చారు. శ్రీవాణి విచారణకు సహకరించడం లేదని పోలీసులు అంతకు ముందు తెలిపారు. ఆమెను విచారణకు పిలిపించామని, రాకుంటే చర్యలు తీసుకుంటామన్నారు.

TV actress Srivani clash ends with mutual understanding

ఆమెకు ఫోన్ చేశామని, అయినప్పటికీ రాలేదని చెప్పారు. వదినపై శ్రీవాణి దాడి చేసినట్లుగా తేలిందని సీఐ తెలిపారు. ఇవాళ, రేపటిలోగా పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని చెప్పారు. ఈ నేపథ్యంలో శ్రీవాణి రాజీకి వచ్చినట్లు తెలుస్తోంది. పరిగిలో ఉన్న తన ఆస్తుల విలువ రూ.ఐదారు కోట్ల వరకు ఉంటుందని శ్రీవాణి తండ్రి ఇంతకు ముందు చెప్పారు.

తనకు ఐదుగురు కూతుళ్లను, దానిని తన పిల్లలందరికీ సమానంగా పంచుతానని చెప్పారు. తన సోదరి ఎప్పుడు పరిగి వెళ్లలేదని, ఆమె ఎవరినీ వేధించలేదని శ్రీవాణి సోదరి చెప్పారు. శ్రీవాణి తండ్రి చెప్పిన విధంగా రాజీ కుదిరినట్లు తెలుస్తోంది.

తన వదిన అనూషతో రేగిన వివాదానికి టీవి నటి శ్రీవాణి తెర దించారు. ఇరువురికి మధ్య పోలీసు స్టేషన్‌లో ఓ ఒప్పందం కుదిరింది. దాంతో సమస్య ముగిసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The tussle between tV actress Srivani and her daughter-in-law Anusha solved on the issue Parigi property

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X