హన్సిక భర్తకి అంతకు ముందే పెళ్లి జరిగిందని తెలుసా.. బెస్ట్ ఫ్రెండ్ తోనే !!
దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన వారిలో Hansika Motwani ఒకరు. బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆమె.. తెలుగు, తమిళ్‌తో పాటు హన్సిక హిందీ, కన్నడ భాషల్లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. అందం, స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించింది. చిన్న వయస్సులోనే పలు హిందీ టీవీ సీరియల్స్‌లో నటించింది. ముఖ్యంగా Shaka Laka Boom Boom అనే పిల్లల ఫాంటసీ సీరియల్ ద్వారా ఆమె మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత బాలనటిగా కూడా కొన్ని బాలీవుడ్ చిత్రాల్లో కనిపించింది.
కాగా హన్సిక హీరోయిన్‌గా బాలీవుడ్‌లో Aap Kaa Surroor చిత్రంతో పరిచయమైంది. ఇందులో ఆమె Himesh Reshammiya సరసన నటించింది. అయితే ఆమెకు అసలు బ్రేక్ మాత్రం దక్షిణాది చిత్రాల్లో వచ్చింది. తెలుగు చిత్రమైన దేశముదురు ద్వారా హీరోయిన్‌గా పరిచయమై.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత వరుస పలువుర్ యంగ్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

విడాకుల రచ్చ..
కాగా హన్సికా మోత్వానీ విడాకుల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వ్యాపారవేత్త సోహైల్ ఖతురియాని ప్రేమ వివాహం చేసుకున్న ఆమె.. తమ 4 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికింది. కాగా హన్సిక వ్యక్తిగత జీవితం గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడం విడాకుల పుకార్లకు మరింత బలం చేకూర్చింది. అయితే వీటిపై ఇన్నాళ్లూ ఆమె మౌనం ఉన్నా.. ఎట్టకేలకు అధికారికంగా విడిపోతున్నట్టు ప్రకటించడంతో వైవాహిక బంధంపై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది.
అంతకు ముందే పెళ్లి..
మరోవైపు సోహైల్‌కు హన్సిక కంటే ముందే మరొకరితో వివాహం జరిగినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత సోహైల్ - హన్సిక పెళ్లి చేసుకున్నారు. అయితే సోహైల్ మొదటి భార్య ఎవరో కాదని.. ఒకప్పుడు హన్సిక బెస్ట్ ఫ్రెండ్ రింకీ బజాజ్ అని తెలుస్తోంది. 2016లో వైభవంగా జరిగిన రింకీ-సోహైల్ పెళ్లికి హన్సిక కూడా వెళ్లి.. సంగీత్ లో డాన్సులు చేస్తూ సందడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతే కాకుండా అప్పట్లో రింకీ-సోహైల్ విడిపోవడానికి హన్సికనే కారణం అనే ప్రచారం జరిగింది. దాన్ని నిజం చేస్తూ హన్సిక-సోహైల్ పెళ్లి చేసుకున్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఈ జంట కూడా విడాకుల బాట పట్టడం చర్చకు తెరలేపింది.












Click it and Unblock the Notifications