ఇక రోడ్ల మీద విమానంలా దూసుకుపోవచ్చు! గంగా ఎక్స్‌ప్రెస్‌వేతో అదానీ సత్తా!

భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తున్న 'గంగా ఎక్స్‌ప్రెస్‌వే' ప్రారంభానికి సిద్ధమవుతోంది. సుమారు రూ.36,000 కోట్ల భారీ వ్యయంతో నిర్మితమవుతున్న ఈ ఎక్స్‌ప్రెస్‌వే, ఉత్తరప్రదేశ్‌లో పారిశ్రామిక వృద్ధిని పరుగులు పెట్టించడమే కాకుండా, దేశంలోనే అతిపెద్ద 'గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే'గా రికార్డు సృష్టించనుంది.

మొత్తం 594 కిలోమీటర్ల పొడవున్న ఈ ప్రాజెక్టులో సింహభాగం, అంటే దాదాపు 464 కిలోమీటర్లను (80 శాతం) అదానీ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తోంది. మిగిలిన 130 కిలోమీటర్ల బాధ్యతను ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా చేపట్టింది. విమానాశ్రయాలు, పోర్టులు, లాజిస్టిక్స్ రంగంలో ఇప్పటికే అగ్రగామిగా ఉన్న అదానీ గ్రూప్‌కు, ఈ గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఒక వ్యూహాత్మక విజయంగా నిలవనుంది.

Ganga Expressway Completed in Record Time Adani Group s Strategic Link in India s Logistics Ecosystem

ఇంజనీరింగ్ అద్భుతం - రికార్డు సమయం!

కేవలం 3 ఏళ్ల 3 నెలల రికార్డు సమయంలోనే ఈ ప్రాజెక్టు పూర్తి కావడం భారత ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం.

  • విస్తరణ: ప్రస్తుతం 6 లేన్లుగా నిర్మించినా, భవిష్యత్తు అవసరాల కోసం 8 లేన్ల వరకు విస్తరించేలా 120 మీటర్ల రోడ్డు హక్కు (Right-of-way) కేటాయించారు.
  • వరద రక్షణ: గంగా నది పరివాహక ప్రాంతం కావడంతో, రోడ్డును సాధారణ భూమి స్థాయి కంటే 6 మీటర్ల ఎత్తులో నిర్మించారు.
  • మౌలిక సదుపాయాలు: 437 అండర్‌పాస్‌లు, 21 ఫ్లైఓవర్లు, 76 చిన్న వంతెనలతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా డిజైన్ చేశారు.

లాజిస్టిక్స్ విప్లవం - తగ్గనున్న వ్యయాలు

భారతదేశ జీడీపీలో ప్రస్తుతం లాజిస్టిక్స్ వ్యయం 14 శాతంగా ఉండగా, దానిని అభివృద్ధి చెందిన దేశాల స్థాయిలో (8-9%) తగ్గించడమే అదానీ లక్ష్యం. గంగా ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా వస్తువుల రవాణా వేగవంతం అవడమే కాకుండా, సుమారు 30 శాతం ఇంధన ఆదా జరుగుతుందని అంచనా. మీరట్ నుండి ప్రయాగ్‌రాజ్ మధ్య ప్రయాణ సమయం 11 గంటల నుండి కేవలం 6 గంటలకు తగ్గిపోనుంది.

ఆర్థిక వృద్ధికి 11 పారిశ్రామిక కారిడార్లు

ఈ ఎక్స్‌ప్రెస్‌వే వెళ్లే 12 జిల్లాల్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 11 పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేస్తోంది. ఇవి లక్షలాది మందికి ఉపాధిని కల్పించడమే కాకుండా, గిడ్డంగులు.. తయారీ రంగాలకు హబ్‌గా మారుతాయి.

ఆధ్యాత్మిక పర్యాటకానికి ఊతం

పారిశ్రామికంగానే కాకుండా, ఆధ్యాత్మికంగా కూడా ఈ రహదారి ఎంతో కీలకం. గర్ముక్తిశ్వర, కల్కిధామ్, ప్రయాగ్‌రాజ్ లోని త్రివేణి సంగమం వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలకు ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఇది స్థానిక పర్యాటక మరియు ఆతిథ్య రంగాలకు పెద్ద పీట వేయనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+