త్వరలోనే కరువు మండలాల ప్రకటన .. రబీలో ఆ పని చెయ్యొద్దు: రైతులకు అలెర్ట్!

తెలంగాణా రాష్ట్ర రైతాంగానికి రైతు నేస్తం కార్యక్రమం ద్వారా ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల రైతులతో రైతు వేదికల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మంత్రులు రైతులకు పలు కీలక సూచనలు చేశారు. ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా రబీ సీజన్‌లో రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి సాగు చేయవద్దని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

నేడు హైదరాబాద్‌లో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ఆయన, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సహా అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల్లోని రైతులు, అధికారులతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.

Deputy CM bhatti vikramarka Advises Against Rabi Paddy Cultivation Amid El Nino Threat gave suggestions to farmers

ఈ సందర్భంగా తెలంగాణా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షపాతం తగ్గి నీటి లభ్యత గణనీయంగా తగ్గుతుందని హెచ్చరించారు. కాబట్టి నీటిని పొదుపుగా వినియోగించాలని, బిందు సేద్యం ద్వారా పామ్ తోటలు, కూరగాయలు వంటి స్వల్పకాలిక పంటలను సాగు చేయాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తే మంచిదని సలహా ఇచ్చారు.

వరి వంటి నీటి అవసరం ఎక్కువైన పంటలు సాగు చేస్తే తాగునీటి సమస్య తీవ్రమవుతుందన్నారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతలు, నీటి కుంటలు, బోర్వెల్స్ రీఛార్జ్ వంటి పనులు చేపట్టి జలవనరులను కాపాడుకోవాలని కోరారు. రాష్ట్రంలో 315 మండలాల్లో వర్షపాతం తక్కువగా నమోదైందని, త్వరలోనే కరువు మండలాలను ప్రకటిస్తామని చెప్పారు. వచ్చే వర్షాకాలం నాటికి తాగునీటి సమస్యలు రాకుండా ఇప్పటి నుంచే నీటిని జాగ్రత్తగా వాడాలని సూచించారు.

హైదరాబాద్ విమానాశ్రయంలో ఏమైనా పోగొట్టుకున్నారా? రియల్‌టైమ్ ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్ మీకోసం!
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏమైనా పోగొట్టుకున్నారా? రియల్‌టైమ్ ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్ మీకోసం!

వ్యవసాయానికి విద్యుత్ సరఫరాపై సరైన ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. భూగర్భ జల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు గ్రౌండ్ వాటర్ లెవెల్ నివేదికలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం రైతుల ప్రయోజనాలు, ప్రజా సంక్షేమం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. రైతులు ప్రభుత్వ సలహాలు పాటించి, నీటిని పొదుపుగా వినియోగిస్తే ఈ కష్టకాలం సులభంగా దాటవచ్చని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+