Viral Video: ఆలయంలో ఒంటరిగా మైనర్ బాలిక.. లోపలికి దూరిన మెట్రో వర్కర్.. ఏం జరిగిందంటే..?
నేటి సమాజంలో రోజురోజుకూ మహిళలు, చిన్నారులపై దారుణాలు పెరిగిపోతూనే ఉన్నాయి. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా కొన్ని మానవ మృగాలు ప్రవర్తిస్తున్నాయి. ఆడపిల్ల అయితే చాలు అన్నట్లు మృగాళ్ల మాదిరిగా మీదపడిపోతున్నారు. వావి వరసలు మరచి అత్యాచారాలకు తెగబడుతున్నారు. గుడి, బడి అని తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ తమ కామ వాంఛను తీర్చుకుంటున్నారు. అలా ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోక్సో, నిర్భయ, దిశ లాంటి ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. నిందితుల్ని కఠినంగా శిక్షించినా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా మహారాష్ట్రలోని పింప్రి-చించ్వడ్ లోని నిగ్డీ ప్రాంతంలో షాకింగ్ ఘటన జరిగింది.

స్థానికంగా ఉన్న శివాలయంలో ఓ మైనర్ బాలిక దర్శనం చేసుకుంటూ ఉండగా పక్కనే ఉన్న మెట్రో కన్ స్ట్రక్షన్ వర్కర్ ఆలయంలోని ప్రవేశించాడు. బాలిక ఒంటరిగా ఉందని గ్రహించి గర్భగుడిలోకి దూరాడు. ఆలయంలో బాలిక ఒక్కరే ఉండటం.. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడాన్ని గమనించాడు. దాంతో ఒక్కసారిగా బాలికపై అత్యాచారానికి యత్నించాడు. బాలిక ప్రతిఘటించి కేకలు వేయడంతో భయంతో అక్కడి నుంచి పారిపోయాడు కామాంధుడు.
ఇందుకు సంబంధించిన మొత్తం దృశ్యాలు ఆలయంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అయితే ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానికుల నిరసన చేపట్టారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనతో బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, చిన్నారుల రక్షణ, భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇటీవల కేరళలో ఓ మహిళా ఇన్ ఫ్లూయెన్సర్ 11 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోక్సో చట్టాన్ని మరింత పగడ్బందీగా అమలు చేయాలని పలువురు సూచనలు చేస్తున్నారు. చిన్నారుల భద్రత, రక్షణకు మరిన్ని కఠిన నిర్ణయాలు అవసరం అని అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications
