సాఫ్టువేర్ ఉద్యోగం పేరిట..: అమ్మాయితో మాట్లాడించి ముగ్గులోకి
హైదరాబాద్: ఆన్‌లైన్‌లో సాఫ్టువేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేస్తున్న ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు రట్టు చేశారు. నిందితులు నీతూ కుమార్, కృష్ణన్ కుమార్‌లను పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
పోలీసులు వీరిని ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాదులో అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.45వేల నగదు, ఒక ల్యాప్‌ట్యాప్, నాలుగు సెల్ ఫోన్లు, చెక్‌బుక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిరుద్యోగుల నుంచి వీరు రూ.18 లక్షల వరకు వసూలు చేశారు.
ఇంటర్నేషనల్ సంస్థల్లో ఉద్యోగాల పేరిట వీరు పద్దెనిమిది మందిని మోసం చేశారు. భారీ మొత్తంలో వేతనాల ఉద్యోగాలంటూ వారు బాధితులను నమ్మబలికారు. నోయిడాలో నివసించే నీతు కుమార్, కృష్ణన్ కుమార్ ఇతడి భార్య ఆశా, మరో మహిళ శిఖా శర్మ, సోమేష్ రెడ్డితోపాటు మరో ఇద్దరు ఒక ముఠాగా ఏర్పడ్డారు.

నీతు, కృష్ణన్ ప్రముఖ వెబ్‌సైట్లలో హైదరాబాదుతో బెంగళూరు, చెన్నై తదతర నగరాల్లో ఉద్యోగాలున్నట్లు ప్రకటనలు ఇస్తున్నారు. వారిని సంప్రదించే వారిని మొగ్గలో దించి ఆశా, శిఖాశర్మ ఆయా సంస్థల నుంచి హెచ్‌ఆర్ విభాగం ఉన్నతాధికారులం మాట్లాడుతున్నామని, దొడ్డిదారిన ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు నమ్మిస్తారు.
ఇందుకు రూ.లక్షకు పైగా తమ ఖాతాల్లో జమ చేయాలని చెబుతారు. కూకట్‌పల్లికి చెందిన ఓ బాధితుడు ఇలాగే చేశాడు. ఉద్యోగం ఎంతకూ రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 18 మంది బాధితులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.
ఆన్‌లైన్‌లో సాఫ్టువేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేస్తున్న ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు రట్టు చేశారు. నిందితులు నీతూ కుమార్, కృష్ణన్ కుమార్‌లను పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications