సినిమాతో చెడి, విద్యార్థులకు మత్తు వల: అరెస్టైన సహాయ దర్శకుడు, నిర్మాత

హైదరాబాద్: సినిమాలు తీసి చేతులు కాల్చుకున్న ఓ వ్యక్తి మాదక ద్రవ్యాలను తరలిస్తూ పట్టుబడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. తనిఖీలలో భాగంగా జీడిమెట్ల పోలీసులు రూ.3 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

జీడిమెట్ల పోలీసులు శనివారం నాడు వివరాలు వెల్లడించారు. శుక్రవారం ఉదయం కుత్బుల్లాపూర్ కూడలి వద్ద సురేష్, కిషోర్ అనే ఇద్దరు వ్యక్తులు బైక్ పైన ఓ సంచితో వెళ్తున్నారు. వారి పైన అనుమానం కలిగింది. తనిఖీ చేయకు సంచిలో రూ.1.30 కిలోల మాదకద్రవ్యాలు కనిపించాయి.

వీరిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారు ఇచ్చిన సమాచారంతో ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో మరొకరిని అరెస్టు చేయించారు. నిందితుల్లో ఒకరు సినిమా తీసి చేతులు కాల్చుకున్న వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మరొకరు సహాయ దర్శకుడు కావడం గమనార్హం.

Two arrested for drug supply in Hyderabad

నెల్లూరు జిల్లా వరికుంటపాడుకి చెందిన కందికట్ట వెంకట సురేష్ మణికొండలో ఉంటున్నాడు. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి కొంతకాలం క్రితం వజ్రాల వ్యాపారం చేశాడు. ఓ తెలుగు సినిమాను ప్రారంభించి రూ.60 లక్షు వెచ్చించినా అది పూర్తి కాలేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి.

కరీంనగర్ జిల్లాకు చెందిన కిషోర్ యూసఫ్ గూడలో ఉంటున్నాడు. అతను ప్రముఖ దర్శకుడి వద్ద సహాయ దర్శకుడిగా పని చేస్తున్నాడు. వీరిద్దరు స్నేహితులయ్యారు. ఇధ్దరు కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలని భావించారు.

నెల్లూరు రైల్వే స్టేషన్ వద్ద టీ స్టాల్ నడుపుతున్న శ్రీహరి రెడ్డిని సురేష్ సంప్రదించాడు. అతను అప్టోమిన్ విత్ కొకైన్ మాదక ద్రవ్యాలను నగరంలోని కళాశాలలు అధికంగా ఉన్న మేడ్చల్, దుండిగల్ తదితర ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు విక్రయించాలని సూచించాడు. నెల్లూరు వెళ్లిన సురేష్.. శ్రీహరి రెడ్డి నుంచి 1.30 కిలోల మాదక ద్రవ్యాలను తీసుకొని కిషోర్ సాయంతో విక్రయించేందుకు ప్లాన్ వేశాడు. పోలీసులకు పట్టుబడ్డారు.0

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+