రోడ్డు దాటుతూ తండ్రీకూతుళ్లు అనంతలోకాలకు.... (పిక్చర్స్)

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి హైదరాబాదులోని వనస్థలిపురం సమీపం గల ఇంజాపురం వద్ద చోటుచేసుకుంది. అతి వేగంగా వస్తున్న ఓ కారు రోడ్డుదాటుతున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురిపై దూసుకెళ్లింది.

ఈ సంఘటనలో తండ్రి, కూతురు మృతి చెందగా కొడుకు, తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హృదయవిదారకమైన సంఘటన వివరాల్లోకి వెళితే.. హయత్‌నగర్ మండలం తొర్రూరు గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

గోశిక రంగయ్య (40) భార్య మంగమ్మ (35), కూతురు సింధు(10), కొడుకు అజయ్ (6) కాగా మంగమ్మ తన ఇద్దరు పిల్లలతో ఇబ్రాహీంపట్నం మండలం పెచ్చుళ్ల గ్రామంలో జరిగిన ఓ శుభ కార్యానికి హాజరై సోమవారం సాయంత్రం బస్సులో తిరుగు ప్రయాణమైంది.

బస్సు దిగిన తర్వాత..

బస్సు దిగిన తర్వాత..

ఆ నలుగురు వనస్థలిపురం సమీపంలోని ఇంజాపూర్ చౌరస్తా వద్ద బస్సు దిగారు.వీరిని ఇంటికి తీసుకెళ్లేందుకు రంగయ్య ఓ బైక్‌పై అక్కడికి చేరుకున్నారు.

అదుపు తప్పిన కారు...

అదుపు తప్పిన కారు...

అదే సమయంలో బిఎన్‌రెడ్డి నగర్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ఓ కారు నెం. ఎపి 28 ఎకె 2535 అదుపు తప్పింది.

రోడ్డు దాటుతుండగా..

రోడ్డు దాటుతుండగా..

ఒకే కుటుంబానికి చెందిన వీరు రోడ్డు దాటుతుండగా కారు వారిపై దూసుకెళ్లింది. దీంతో సింధు అక్కడిక్కడే మృతి చెందగా, రంగయ్య ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

ఆమె కాలు ఫాక్చర్..

ఆమె కాలు ఫాక్చర్..

మంగమ్మ కాలు ఫ్యాక్చర్ కాగా అజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు ఇన్‌స్పెక్టర్ పుష్పన్ కుమార్, ఎస్‌ఐ మధుసూదన్ తెలిపారు.

కాసేపట్లో ఇంటికి చేరుతారనగా...

కాసేపట్లో ఇంటికి చేరుతారనగా...

కాసేపట్లో ఇంటికి చేరుతామని అనుకున్న కుటుంబ సభ్యులు అనుకోకుండా ప్రమాదానికి గురయ్యారు. ఓ కారు వారి పాలిట మృత్యుశకటమైంది.

సెంట్రింగ్ కూలీగా..

సెంట్రింగ్ కూలీగా..

కోశిక రంగయ్య సెంట్రింగ్ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సింధూ తొర్రూరు ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది.

నాలుగో తరగతి...

నాలుగో తరగతి...

అజయ్ హయత్‌నగర్‌లోని గౌతమ్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. అజయ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

డ్రైవర్ పరారీ..

డ్రైవర్ పరారీ..

సంఘటనా స్తలంలోనే కారును వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. రహదారిపై వీధి దీపాలు వెలగకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+