మద్యం తాగి కెసిఆర్ కాన్వాయ్‌కు అడ్డొచ్చిన ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్: మద్యం తాగిన ఇద్దరు వ్యక్తులు శుక్రవారం సాయంత్రం తెలంగాణ సీఎం కెసిఆర్ కాన్వాయ్‌కు అడ్డు వచ్చారు. అయితే వారిని కార్ఖానా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
తెలంగాణ సీఎం కెసిఆర్ కాన్వాయ్‌కు సికింద్రాబాద్ లోని కార్ఖానా వద్ద ఇద్దరు తాగుబోతులు అడ్డుగా వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో గుర్తించిన పోలీసులు వెంటను వారిని అదుపులోకి తీసుకొన్నారు.

ముఖ్యమంత్రి కాన్వాయ్ ప్రయాణీస్తున్న సమయంలో పోలీసులు ఆ మార్గంలో బందోబస్తు ఏర్పాటు చేస్తారు. కానీ, ఆ సమయంలో విధుల్లో స్థానికంగా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. దీంతో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐపై చర్యలు తీసుకోనే అవకాశాలు ఉన్నాయని సమాచారం.












Click it and Unblock the Notifications