ఆత్మహత్య: ఎల్లంపల్లి జలాశయంలో దూకి యువతి, నిప్పంటించుకుని ఇంటర్ విద్యార్థిని
కరీంనగర్: జిల్లాలోని ఎల్లంపల్లి జలాశయం వద్ద విషాద సంఘటన చోటుచేసుకుంది. జలాశయంలోకి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం స్థానికంగా పనులు నిర్వహించుకుంటున్న కొందరు వ్యక్తులు బ్రిడ్జిపై హ్యాండ్ బ్యాగ్ ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని హ్యాండ్‌బ్యాగ్‌ను పరిశీలించారు. అందులోభాగంగా ఓ చీటి కనిపించింది. అందులో.. రామగుండం మండలం గూడూరు గ్రామానికి చెందిన గాజుల పద్మగా రాసి ఉంది.
అలాగే ఆమె స్థానిక దక్కన్ గ్రామీణ బ్యాంక్‌లో కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్‌గా పనిచేసినట్లు ఆధారాలు లభించాయి. దీంతో పోలీసులు బ్యాంకు ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నారు. అయితే పద్మ మృతికి గల కారణాలు తెలియరాలేదు. అలాగే పద్మ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిప్పంటించుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మండిగౌరెల్లి గ్రామంలో గురువారం ఉదయం స్రవంతి(16) అనే ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో తలుపులు తలుపులు వేసుకుని ఒంటిపై కిరోసిస్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే మృతి చెందింది.
స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, స్రవంతి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
దంపతుల ఆత్మహత్యాయత్నం: భర్త మృతి
వరంగల్: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వరంగల్ జిల్లా ములుగు మండలం పత్తిపల్లి గ్రామ పంఛాయతీ పరిధిలోని చింతకుంట గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో భర్త మృతి చెందగా.. భార్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది.
నల్లబెల్లి మండలం గుళ్లపహాడ్ గ్రామానికి చెందిన దంపతులు కేలోతు రాజు (25), అనిత (23) పొట్టకూటి కోసం ఆరేళ్ల కిందట చింతకుంటలో స్థిరపడ్డారు. స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఏడాది మూడెకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం కూడా చేస్తున్నారు.
పెట్టుబడులకు డబ్బులు లేక పోవడంతో.. బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి భార్యా భర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన స్థానికులు వారిని ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ రాజు మృతి చెందారు. అనిత పరిస్థితి మాత్రం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications