బావతో అఫైర్: ఇద్దరు ఆత్మహత్య, ఏం జరిగిందంటే?
వరంగల్: మరదలితో వివాహేతర సంబంధం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. మరదలిని చంపేసి తాను కూడ ఆత్మహత్య చేసుకొన్న ఘటన వరంగల్ జిల్లాలో సంచలనం చోటు చేసుకొంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వివాహేతర సంబంధాలు కుటుంబాల్లో చిచ్చును పెడతాయి ఇలాంటి ఘటనలను అనేకం మనం చూస్తున్నాం, వింటున్నాం. అయితే అదే తరహ ఘటన ఒకటి వరంగల్ జిల్లాలో చోటు చేసుకొంది.
గ్రేటర్ వరంగల్ నగర పరిధిలోని 55వ, డివిజన్ భీమారంలో అసిస్టెంట్ ప్రోఫెసర్ ప్రవీణ్ రెడ్డి ఆయన మరదలు రక్షణారెడ్డి ఆత్మహత్య చేసుకొన్నారు. ఈ ఘటన వరంగల్ నగరంలో కలకలం రేపుతోంది.

వివాహేతర సంబంధంతో ఆత్మహత్య
గ్రేటర్ వరంగల్ నగర పరిధిలోని 55వ, డివిజన్ భీమారంలో అసిస్టెంట్ ప్రోఫెసర్ ప్రవీణ్ రెడ్డి, ఆయన మరదలు రక్షణారెడ్డి ఆత్మహత్య చేసుకొన్నారు. వరంగల్ అర్భన్ జిల్లా ఎల్కతుర్తి మండలం జిలుగులకు చెందిన తిరుపతిరెడ్డి అరుణ దంపతులకు ప్రతిభారెడ్డి, రక్షణారెడ్డి కూతుళ్ళు ఉన్నారు. వీరితో పాటు మరో కుమారుడు కూడ ఉన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్‌కు చెందిన రావుల రవీందర్ రెడ్డి రాజేశ్వరీ దంపతుల కుమారుడు ప్రవీణ్ రెడ్డితో ప్రతిభారెడ్డికి మూడేళ్ళ క్రితం పెళ్ళైంది. వీరికి రెండేళ్ళ కూతురు కూడ ఉంది. ప్రవీణ్‌రెడ్డి అసిస్టెంట్ ప్రోఫెసర్‌గా పనిచేస్తున్నాడు. భార్య సోదరి రక్షణారెడ్డితో ప్రవీణ్ రెడ్డికి వివాహేతర సంబంధం ఏర్పడింది.ఈ సంబంధం బయటకు పొక్కడంతో వీరిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ప్రవీణ్ రెడ్డితో రక్షణరెడ్డికి వివాహేతర బంధం
ప్రవీణ్ రెడ్డికి మరదలు రక్షణారెడ్డితో వివాహేతర సంబంధం ఏర్పడింది. చదువు కోసం నగరంలో ప్రైవేటో కాలేజీలో రక్షణారెడ్డి చేరింది. మూడేళ్ళుగా అక్క ఇంట్లోనే రక్షణారెడ్డి నివాసం ఉండేది. ఈ తరుణంలోనే రక్షణారెడ్డితో ప్రవీణ్ రెడ్డికి వివాహేతర సంబంధం ఏర్పడింది..ఈ విషయం కుటుంబసభ్యులకు తెలిసింది. దీంతో పంచాయితీ నిర్వహించారు. రక్షణారెడ్డిని ఇంటికి తీసుకెళ్ళారు. అంతేకాదు ప్రవీణ్ రెడ్డిని కూడ పెద్దలు మందలించారు. అయితే చదువుకు ఇబ్బందులు కాకూడదనే ఉద్దేశ్యంతో రక్షణారెడ్డి తన ఇంటి నుండే వరంగల్‌లోని కాలేజీకి బస్సులో వస్తుండేది.

కాలేజీకి వెళ్ళిన రక్షణారెడ్డి శవంగా మారింది
ఉగాది పండుగ కోసం ప్రవీణ్ రెడ్డి సతీమణి ప్రతిభారెడ్డి తన పుట్టింటికి వెళ్ళింది. అయితే ఉగాది పర్వదినం రోజున ప్రవీణ్ రెడ్డి తన స్వస్థలానికి వెళ్ళాడు. అక్కడి నుండే కాలేజీకి వస్తున్నాడు. అయితే ఉగాది పర్వదినం సందర్భంగా ఇంటికి వెళ్ళిన ప్రతిభారెడ్డి రాలేదు. అయితే ప్రతిరోజూ మాదిరిగానే కాలేజీ కోసం వరంగల్‌కు వచ్చిన రక్షణారెడ్డి సాయంత్రమైనా ఇంటికి రాలేదు. దీంతో రక్షణారెడ్డికి కుటుంబసభ్యులు ఫోన్లు చేశారు. కానీ, ఆమె ఫోన్ పనిచేయలేదు. ప్రతిభారెడ్డి తండ్రితో కలిసి వరంగల్‌లోని తన ఇంటికి వెళ్ళి చూసేసరికి రక్షణారెడ్డి మంచంపై శవమై పడి ఉంది.

ఆత్మహత్య చేసుకొన్న ప్రవీణ్ రెడ్డి
రక్షణారెడ్డి బెడ్‌మీద చనిపోయి ఉండగా ఆమె బెడ్ పక్కనే ప్రవీణ్ రెడ్డి మృతదేహం పడి ఉంది. రక్షణారెడ్డిని చంపేసి ప్రవీణ్ రెడ్డి ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రవీణ్ రెడ్డి ఆత్మహత్యచేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నాడని పోలీసులు చెప్పారు. ఐదు రోజుల క్రితమే ప్రవీణ్ రెడ్డి సూసైడ్ నోట్ రాశాడు.ఈ నోట్ ప్రకారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications