సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు అక్కడికక్కడే మృతి!
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కోమరబండలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి రావులపాలెం వెళ్తున్న ఓ కారు.. కోమరబండ వద్ద ఆగి వున్న లారీని వెనుక నుంచి అతివేగంతో ఢీకొట్టింది.
ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాద సమాచారంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులను సత్యనారాయణ(35), మైత్రి(21)గా గుర్తించారు.

ఇటీవల సత్యనారాయణ తల్లి చనిపోవడంతో శాస్త్ర ప్రకారం నిర్వహించాల్సిన కొన్ని కార్యక్రమాల కోసం ఆ కుటుంబం రావులపాలెం బయలుదేరినట్టు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications