బాంబులు ఎక్కడ పేల్చాలనుకున్నారో గుర్తించాం: ఐసిస్‌పై ఎన్ఐఏ
హైదరాబాద్: పాతబస్తీలో తొలుత పలువురు ఐసిస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ అధికారులు.. వారు దేశంలో బాంబులు పేల్చలనుకున్న ప్రాంతాలను గుర్తించారు. ఐసిస్ సానుభూతిపరులు సంచరించిన ప్రాంతాలను ఎన్ఐఏ అధికారులు గుర్తించి, వారు సంచరించిన చోట సిసిటివి ఫుటేజీలను సేకరించారు.
హైద్రాబాద్‌లో భారీ పేలుళ్లకు ఐసిస్ కుట్ర: మరో ఇద్దరు అరెస్ట్గత నెల 30వ తేదీన అయిదుగురిని, ఇటీవల ఇద్దరిని అరెస్టు చేశారు. అయిదుగురిని తమ కస్టడీలోకి తీసుకున్న అధికారులు వారిని విచారించిన అనంతరం మిగతా ఇద్దరిని అరెస్టు చేశారు. అయిదుగురిని విచారించిన అధికారులు కీలక విషయాలను వారి నుంచి రాబట్టారు.

కస్టడీ నివేదికను కోర్టులో అధికారులు దాఖలు చేశారు. సానుభూతిపరులు ఈ మెయిల్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియా ద్వారా విదేశాల్లోని ఏఏ ఉగ్రవాదులతో సంప్రదింపులు జరపారన్న విషయాన్ని తెలుసుకున్నట్లు అందులో పేర్కొన్నారు.
నిందితులిచ్చిన సమాచారం ఆధారంగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు, తదితర సామాగ్రిని ఎక్కడెక్కడ కొనుగోలు చేశారో నిర్ధారించినట్లు తెలిపారు. వీటన్నింటినీ స్వాధీనం చేసుకుని విశ్లేషణ నిమిత్తం కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్సెస్ లేబొరేటరీలకు పంపినట్లు చెప్పారు.
ఐసిస్ వైపు..: కేరళలో 17 మంది గాయబ్, ఇద్దరు గర్భవతులేనిందితులకు ఉగ్ర సంస్థలతో ఉన్న సంబంధాలకు చెందిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఎన్ఐఏ అధికారులు తదుపరి దర్యాప్తు నిమిత్తం ఇటీవల అరెస్టైన ఇద్దరితో పాటు గతంలో అరెస్టు చేసిన ఇబ్రహీం ఎజ్దానీ, ఇలియాస్ ఎజ్దానీలను కూడా మరో 8 రోజులపాటు కస్టడీకి తీసుకున్నారు.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications