ఐసిస్ వైపు..: కేరళలో 17 మంది గాయబ్, ఇద్దరు గర్భవతులే

Posted By:
Subscribe to Oneindia Telugu

తిరువనంతపురం: కేరళలో ఇద్దరు క్రైస్తవ అన్నదమ్ములు ప్రేమ వివాహాలు చేసుకొని, భార్యలతో పాటు ఇస్లాంలోకి మారి ఆ తర్వాత కనిపించకుండా పోయారు. నలుగురూ దేశం విడిచి వెళ్లారని భావిస్తున్నారు. తమ్ముడి భార్య తల్లి నెల రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో నలుగురి అదృశ్యం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేరళలో గత మే నుంచి 17మంది ముస్లిం యువత కనిపించకుండా పోవడం సంచలనం సృష్టిస్తోంది. వారిలో పలువురు ఐసిస్‌లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని ప్రచారం సాగుతోంది.

హైద్రాబాద్‌లో 'కొత్త'వ్యూహంతో విధ్వంసంకు ఐసిస్ ప్లాన్

సదరు ఇద్దరు అన్నదమ్ములే కాకుండా మరో అయిదు కుటుంబాలు కూడా పిల్లలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాయి. వారి నేపథ్యాలను పోలీసులు ఆరా తీయగా ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఇందులో క్రైస్తవం నుంచి ఇస్లాంలోకి మారిన వారు కూడా ఉన్నారు.

‌పాలక్కాడ్‌కు చెందిన అన్నదమ్ములు యాహ్యా (31), ఈసా (23)లు క్రైస్తవులు. తండ్రి గల్ఫ్‌ దేశాల్లో పని చేసి వచ్చి స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. మారుతల్లి పెంపకంలో పెరిగారు. తల్లిదండ్రుల సమ్మతి లేకుండానే వారు ఇస్లాం ప్రభావంలోకి వెళ్లారు.

Pregnant woman converts to Islam;

యాహ్యా ముంబైలో ఉద్యోగం చేస్తున్నపుడు మెరిన్‌ జాకబ్‌ను ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇస్లాంలోకి మారారు. మరోవైపు, సెంచురీ కళాశాలలో దంత వైద్యం చివరి సంవత్సరం చదువుతున్న నిమిష హాస్టల్లో ఓ మిత్రురాలి ప్రోత్సాహంతో ఇస్లాంలోకి మారింది.

ఆ మిత్రురాలే ఈసాను నిమిషకు పరిచయం చేసింది. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకొని, మతం మారారు. నిమిష ఫాతిమా అయ్యింది. వివాదాస్పద మత బోధకుడు జకీర్‌ నాయక్‌ ప్రసంగాల వీడియోలను నిమిష డౌన్‌లోడ్‌ చేసేదని ఆమె స్నేహితురాళ్లు తెలిపారు.

నలుగురూ మే 15-18 మధ్యకాలంలో కనిపించకుండా పోయారు. వాట్సప్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉన్నారు. జూన్‌ 4 తర్వాత అవీ లేవు. ఇద్దరు కోడళ్లూ గర్భవతులని అత్త ఎల్సీ చెబుతున్నారు.

ఐసిస్ ప్లాన్: 'క్రాస్ ఎగ్జాం' షాక్, ఎలా బుట్టలో వేస్తారు?

అన్నదమ్ములిద్దరూ శ్రీలంకలో తివాచీల వ్యాపారం చేస్తామంటూ తల్లిదండ్రుల దగ్గర ఐదు లక్షలు తీసుకొని వెళ్లారు. తర్వాత కనిపించకుండా పోయారు. గతేడాది మేలో కూడా ఈసా-నిమిషలు శ్రీలంక వ్యాపారం పేరుతో వెళ్లి వచ్చారు.

తన కూతురు మేలో వెళ్లిపోయినప్పటి నుంచి ఆమెతో నేరుగా మాట్లాడింది లేదని నిమిష తల్లి బిందు చెప్పింది. జూన్‌ 15న పాలక్కాడ్‌లోని అల్లుడి ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులతో మాట్లాడానని, అందరం కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. బిందు ఆదివారం సీఎంను కలిసి వినతి పత్రం ఇచ్చారు.

బిందు మాట్లాడుతూ... నెల రోజులుగా తన కుమార్తె ఆచూకీ లేదని, 24 ఏళ్ల ఆమె ప్రస్తుతం గర్భవతి అని చెప్పారు. ఆమె డెంటిస్ట్‌ అని, ఆమె సోదరుడు నేషనల్‌ సెక్యురిటీ గార్డ్‌(ఎన్‌ఎస్‌జి) కమెండో అని బిందు తెలిపారు. కాగా, అదృశ్యమైన పదిహేడు మందిలో మరొకరు కూడా గర్భవతి అని తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
As reports of 17 people from Kerala having joined the Islamic terror group ISIS have emerged, it has also been reported that among them is a 25-year-old pregnant woman.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి