రహస్య ప్రాంతంలో ఉన్నారా: ఏ క్షణంలోనైనా ఇద్దరు టీడీపీ ఎంపీల అరెస్ట్?
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు పార్లమెంటు సభ్యుల అరెస్టుకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రంగం సిద్ధం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఆ ఇద్దరు ఎంపీలు ఓ రహస్య ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందుకున్న ఏసీబీ, వారు అందుబాటులోకి రాగానే అరెస్టు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.
పార్లమెంటు సభ్యుల అరెస్టుకు సంబంధించి చట్టపరమైన అన్ని అనుమతులను ఏసీబీ అధికారులు ఇప్పటికే తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయంలో లోకసభ స్పీకరు అనుమతి సైతం లభించినట్లు తెలుస్తోంది.

చంద్రబాబుకు నోటీసులు ఇవ్వలేరా?
టీడీపీ కార్యాలయం వద్ద ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఓటుకు నోటు రేవంత్ రెడ్డి కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి వస్తున్న లింకులతో పార్టీ శ్రేణులు అప్రమత్తమయ్యాయి.
చంద్రబాబుకు ఏ క్షణమైన తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేయవచ్చునన్న ప్రచారం మంగళవారం ఉదయం నుంచి జరుగుతోంది. అయితే ఏసీబీని ఇంతవరకు ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక అందలేదని, అది లేకుండా చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడం సాధ్యం కాదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications