సెల్ఫీ మోజులో ఇద్దరు ఇలా చేశారు...చివరకు ప్రాణాలు కోల్పోయారు

స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత సెల్పీలు తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. ఈ సెల్పీలు ప్రాణాల మీదికి తెస్తున్నాయి.

ఘట్ కేసర్ : స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత సెల్పీలు తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. ఈ సెల్పీలు ప్రాణాల మీదికి తెస్తున్నాయి.

మృత్యువుకు సెల్పీలు మార్గాన్ని చూపుతున్నాయి. ప్రమాదం అంచులోకి వెళ్ళినా సెల్పీ మోజులో పడి గుర్తించడం లేదు. దీంతో సెల్పీ కోసం చనిపోతున్న ఘటనలను రోజు ప్రసార సాధనాల్లో చూస్తున్నాం.

two students dead for clicking selfi

ఇదే తరహ ఘటన ఒకటి తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో చోటుచేసుకొంది. హైద్రాబాద్ లో తార్నాక నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న అవినాష్ ,చరణ్,భరత్, వంశీ లు గురువారం మధ్యాహ్నం ఘట్ కేసర్ సమీపంలోని సత్యపాల్ క్రషర్ మిల్ వద్ద ఉన్న నీటి గుంత వద్దకు వెళ్ళారు.

two students dead for clicking selfi

అవినాష్, చరణ్ లు సెల్పీ తీసుకొంటుండగా కాలు జారి ప్రమాదవశాత్తు ఇద్దరూ కూడ నీటి గుంటలో పడ్డారు. వీరిని మిగిలిన మిత్రులు రక్షించే ప్రయత్నం చేస్తుండగానే ఊపిరాడక చనిపోయారు.

two students dead for clicking selfi

ఈ సమాచారం తెలుసుకొన్న మృతుల కుటుంసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘట్ కేసర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+