మరో ఒమిక్రాన్ కేసు.. హన్మకొండ మహిళకు పాజటివ్.. యుకే వచ్చిన అతివ
తెలంగాణలో ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. ఇవాళ మరో కేసు వచ్చింది. యుకే నుంచి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ సోకింది. ఈ విషయాన్ని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. ఆమె హన్మకొండకు చెందిన వారు అని తెలిపారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 8కి చేరింది. తొలుత హైదరాబాద్‌లో రెండు కొత్త వేరియంట్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

మొత్తం 8
అబుదాబి నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్లు గుర్తించారు. డిసెంబర్ 12వ తేదీన షార్జా నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. కెన్యా నుంచి వచ్చిన 24 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించినట్లు, జీనోమ్ సెక్వెన్సింగ్ లో నిర్ధారణ అయ్యిందని తెలిపారు. డిసెంబర్ 12న సొమాలియా నుంచి వచ్చిన వ్యక్తికి పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ లో ఆ వ్యక్తికి కూడా ఒమిక్రాన్ గా నిర్ధారణ అయ్యింది. వీరిద్దరూ కూడా టోలిచౌకి ఏరియాకు చెందిన వారని పేర్కొన్నారు. కెన్యా, సోమాలియాకు చెందిన వీరిద్దరూ కూడా టోలిచౌకీలో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.

నిన్న 4
గురువారం మరో నాలుగు కేసులు వచ్చాయి. ఇందులో ముగ్గురు విదేశీయులు కాగా.. ఒకరు స్వదేశీయులు ఉన్నారు. ఇవాళ మరో కేసు రావడంతో కేసుల సంఖ్య 8కి చేరింది. కెన్యా నుంచి వచ్చిన ముగ్గురు, అబుబాది ఒకరు, యుకే నుంచి ఒకరు, దుబాయ్ నుంచి ఇద్దరు చెక రిప్లబిక్ నుంచి వచ్చిన ఒకరికి ఒమిక్రాన్ సోకిందని శ్రీనివాస రావు తెలిపారు. ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన టోలిచౌకిలో గల 25 ఇళ్ల మేరకు కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పరీక్షించగా.. కేసులు వెలుగుచూస్తున్నాయి. ప్రస్తుతం వీరందరికి మైల్డ్ సింప్టమ్స్ ఉన్నాయని భయపడాల్సిన అవసరం లేదని శ్రీనివాస రావు తెలిపారు.

ఇవాళ ఒకరు..
తొలుత ఒమిక్రాన్ మైల్డ్ సింప్టమ్స్ కనిపిస్తున్నాయి. కానీ దాని తీవ్రత పెరుగుతుంది. బ్రిటన్‌లో ఒకరు మరణించడంతో తీవ్రత ఎక్కువగా ఉందని భావించారు. అలాగే ఒమిక్రాన్ సోకిన వ్యక్తికి తిరిగి 90 రోజుల తర్వాత మళ్లీ వైరస్ సోకుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇదీ కాస్త ఆందోళన కలిగించే అంశంగా మారింది. వైరస్ మ్యూటెంట్లు వేగంగా మారడంతో.. శాస్త్రవేత్తలు పదే పదే హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications