union budget 2026: కేంద్ర బడ్జెట్ పై తెలంగాణా ఆశలు ఈ సారైనా తీరేనా?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు పార్లమెంట్‌‌లో బడ్జెట్‌ ప్రవేశ పెడుతున్నారు. ఈసారి బడ్జెట్లో నైనా తెలంగాణ రాష్ట్రంలో సుదీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్న అనేక కీలక ప్రాజెక్టులకు మోక్షం లభిస్తుందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుంది. ఈ కేటాయింపులను పరిశీలించాకే రాష్ట్ర బడ్జెట్ కసరత్తును పూర్తిచేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.

కేంద్రం ముందు తెలంగాణా కీలక ప్రాజెక్ట్ లు

ముఖ్యంగా కేంద్ర బడ్జెట్లో ప్రతిసారి తెలంగాణ రాష్ట్రానికి సరైన ప్రాధాన్యత దక్కడం లేదనే టాక్ ఉంది. విభజన చట్టంలోని హామీలతో పాటు దాదాపు 12 కీలక శాఖలకు సంబంధించిన 47 అంశాల చిట్టా ఇప్పటికే కేంద్రం ముందు ఉంచిన తెలంగాణ ప్రభుత్వం ఈసారైనా వాటికి మోక్షం లభిస్తుందని భావిస్తోంది. హైదరాబాద్ విశ్వ నగర విస్తరణకు మౌలిక సదుపాయాలకు భారీ ఊతమిచ్చే కీలక ప్రాజెక్టుల పైన కేంద్రానికి కీలక ప్రతిపాదనలు పంపింది.

union budget 2026 telangana expectations on union budget over key projects like hyderabad master plan and metro

ఈ కీలక ప్రాజెక్ట్ లకు కేటాయింపులపై ఆశలు

ఈ నేపథ్యంలో వాటి పైన ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని భావిస్తోంది. మొత్తం 34 వేల 367 కోట్ల రూపాయలతో చేపట్టాల్సిన రీజినల్ రింగ్ రోడ్, ఓ ఆర్ ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ ను కలిపే 45 వేల కోట్ల విలువైన రేడియల్ రోడ్ల ప్రాజెక్టులకు నిధుల కోసం కేంద్రాన్ని కోరుతున్న తెలంగాణ ఈ బడ్జెట్లో కేటాయింపుల పైన ఆశ పెట్టుకుంది

తెలంగాణా ప్రధాన డిమాండ్ల చిట్టా ఇదే

హైదరాబాద్ మెట్రో రెండవ దశ విస్తరణకు, హైదరాబాద్ మాస్టర్ ప్లాన్, వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 17 వేల కోట్లతో నిర్మించే గ్రీన్ఫీల్డ్ హైవే, గోదావరి మూసి అనుసంధానానికి 6 వేల కోట్లు, అనేక కీలక ప్రాజెక్టుల పైన ఆశలు పెట్టుకుంది. అంతేకాదు విభజన హామీ అయిన బయ్యారం ఉక్కు పరిశ్రమ, 8 కొత్త రైల్వే లైన్ల మంజూరు పైన తెలంగాణ ఆశగా ఎదురుచూస్తోంది.

తెలంగాణాకు ఈ బడ్జెట్ లో న్యాయం జరుగుతుందా?

తెలంగాణ రాష్ట్రంలోని విమానాశ్రయాలతో పాటు, తెలంగాణలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమైన ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కోరుతుంది. కొత్తగా ఐఐఎం, నవోదయ, కేంద్రీయ విద్యాలయాల వంటి సంస్థలు మంజూరవుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. అయితే, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి వంటి ఎన్నికలున్న రాష్ట్రాలకే అధిక నిధులు కేటాయించే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో, తెలంగాణకు ఈ బడ్జెట్లో న్యాయం జరుగుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+