Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జాలేస్తోంది.. కేటీఆర్ లీగల్ నోటీసులపై ఘాటుగా కేంద్రమంత్రి బండి సంజయ్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కు లీగల్ నోటీసులు పంపించారు. బండి సంజయ్ ఈనెల 19వ తేదీన తనపై తప్పుడు ఆరోపణలు చేశారని బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డానని ఆరోపించారని అంతేకాదు తను డ్రగ్స్ తీసుకుంటాను అంటూ ఆరోపణలు చేసి తన వ్యక్తిత్వాన్ని అవమానపరిచేలా ప్రవర్తించారని నోటీసులలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఎదుర్కొనే దమ్ము లేక లీగల్ నోటీసులు
ఇక మాజీ మంత్రి కేటీఆర్ పంపించిన లీగల్ నోటీసులపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. మాజీ మంత్రి కేటీఆర్ తనకు లీగల్ నోటీసులు పంపినట్టు మీడియాలో చూశానని పేర్కొన్న ఆయన లీగల్ నోటీసులతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరని స్పష్టం చేశారు. తనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక లీగల్ నోటీసులు ఇవ్వడం చూస్తుంటే జాలేస్తుంది అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు.

union minister Bandi sanjay counter to ktr legal notices to him

సుద్దపూస అనుకుంటున్నావా? కేటీఆర్
ఇక కేటీఆర్ పంపించిన లీగల్ నోటీసుల పైన వ్యాఖ్యలు చేసిన ఆయన తనపై ముందుగా వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించింది కేటీఆర్ నే అని పేర్కొన్నారు. అందుకు బదులుగానే తాను మాట్లాడానని బండి సంజయ్ సమాధానమిచ్చారు. ఆయన సుద్దపూస అనుకుంటున్నాడేమో ఆయన బాగోతం ప్రజలకు తెలుసు అంటూ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నోటీసులకు నోటీసులతోనే బదులిస్తాం
ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ, డ్రగ్స్ కేసు వ్యవహారాన్ని ఏ విధంగా నీరుగార్చారో అందరికీ తెలుసని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ఇప్పటివరకు మాటకు మాటతోనే బదులిచ్చానని పేర్కొని లీగల్ నోటీసులకు నోటీసులతోనే బదిలిస్తానంటూ సమాధానం చెప్పారు. మేము చట్టాన్ని న్యాయాన్ని గౌరవించే వ్యక్తులమని పేర్కొన్న బండి సంజయ్ చట్టం న్యాయం ప్రకారం ముందుకు వెళతామని స్పష్టం చేశారు.

కేటీఆర్ ఆట మొదలెట్టారు .. మేం ముగిస్తాం: బీజేపీ
కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు ఇవ్వడం పైన బిజెపి నాయకులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. లీగల్ నోటీసులతో కేటీఆర్ ఆట మొదలుపెట్టారని ఆటను తాము ముగిస్తామంటూ పేర్కొంటున్నారు. తాము నోటీసులు ఇస్తే కేటీఆర్ పారిపోయే రోజులు వస్తాయని వారు మండిపడుతున్నారు.

లీగల్ నోటీసులే ఆయన రాజకీయ జీవితానికి సమాధి
కేటీఆర్ లీగల్ నోటీసులే ఆయన రాజకీయ జీవితానికి సమాధి కడతాయని బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పైకి వచ్చిన బీసీ నేత బండి సంజయ్ పైన వ్యక్తిగత ఆరోపణలు చేసి మళ్లీ నువ్వే లీగల్ నోటీసులు ఇస్తావా అంటూ కేటీఆర్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+