ఎందుకీ 'హైడ్రా'మాలు... బిడ్డ రాగానే కేసీఆర్ యాగాలు: బండి సంజయ్

'హైడ్రా' పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామాలాడుతోందని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపట్ల ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని ఇదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మండిపడ్డారు. గత కొద్దిరోజులుగా హైడ్రా వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే విశ్వాసం పోతోందన్నారు. సామాన్యులను కూడా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విరక్తి మొదలైంది
కరీంనగర్ లో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విరక్తి మొదలైంది. అతి తక్కువ కాలంలో ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటున్న పార్టీ కాంగ్రెస్ మాత్రమేనన్నారు.కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ...హైడ్రా పేరుతో డైవర్ట్ చేస్తూ హైడ్రామాలాడుతోందని మండిపడ్డారు.

Union Minister Bandi Sanjay targets congress govt hydra demolitions and kcr yagam

అక్కడ పర్మిషన్లు ఎందుకిచ్చారు.. ఎందుకు కూలుస్తున్నారు
తానూ మొదట హైడ్రాకు సపోర్ట్ చేశానని, పెద్దలు అక్రమంగా కట్టుకున్న భవనాలను, విల్లాలను, ఫాంహౌజ్ లను కూలిస్తే సమర్ధించానని, కానీ పొట్టకూటి కోసం వ్యాపారం చేసుకునే షాపులను, పేదల ఇండ్లను కూలుస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు.. ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఎందుకీ హైడ్రామాలు? అక్రమ భవనాలకు, ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో కడుతున్న ఇండ్లకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడెందుకు కూలుస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

తెలంగాణలో బీఆర్ఎస్ కు నో ఎంట్రీ బోర్డు
బిఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ అన్నారు. రాష్ట్ర ప్రజలంతా బీఆర్ఎస్ కు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారన్నారు . కేసీఆర్ ఎన్ని యాగాలు చేసినా ఉపయోగం లేదన్నారు బండి సంజయ్ .బిడ్డ జైలు నుంచి బయటకు రాగానే యాగం చేస్తున్నాడు. చేతనైతే వరదలవల్ల నష్టపోయిన వారి కోసం కేసీఆర్ యాగాలు చేయాలని డిమాండ్ చేశారు.

వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్నా కేసీఆర్ స్పందించరా?
రాష్ట్రమంతా భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతుంటే కేసీఆర్ కనీసం ఎందుకు స్పందించడం లేదు అని ప్రశ్నించారు. ప్రధాన మంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా సీఎంతో మాట్లాడారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాష్ట్రంలో ఏరియల్ సర్వే చేశారు. కానీ ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ వరద బాధితులను పరామర్శించలేదు? ఎందుకో చెప్పాలన్నారు. అందుకే ప్రజలంతా ఆయనకు ' నో ఎంట్రీ' బోర్డు పెట్టేశారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+