జనసేనతో పొత్తు పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు - బందీ అయింది..!!
తెలంగాణలో బీజేపీ ఎన్నికల అజెండా పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణకు బీసీ నేత ను ముఖ్యమంత్రిని చేయటమే బీజేపీ లక్ష్యమని చెప్పారు. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. తెలంగాణలో మార్పు రాదన్నారు. మిగిలిన సీట్లకు అభ్యర్దులు..జనసేనతో పొత్తు వ్యవహారం పైనా స్పందించారు. అదే సమయంలో బీజేపీకి బీఆర్ఎస్‌తో ఎలాంటి సంబంధాలు లేవని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తున్నామని తెలిపారు.
కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు:తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కామారెడ్డిలోనూ, గజ్వేల్‌లోనూ ఓటమి పాలవుతారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. డబ్బుతో అభ్యర్థులు, నాయకులను కొనవచ్చు కాని, ప్రజల కోపాన్ని తగ్గించలేరని తెలిపారు.హుజురాబాద్ ఉపఎన్నికల్లో వచ్చిన ఫలితమే తెలంగాణవ్యాప్తంగా రాబోతోందని కిషన్‌రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ యువత సునామిలా విజృంభించి బీఆర్‌ఎస్‌ను తుడిచిపెడుతుందని ప్రకటించారు. ప్రజా ఆందోళనలను అణిచివేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం, మంత్రులను కలిసే వీలు లేకుండా పోయిందన్నారు. దళితుడిని సీఎం చేస్తానని.. కేసీఆర్ మాట తప్పారని.. ఉద్యోగ నియామకాల్లో విఫలమయ్యారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ఏపీ రోడ్లపై కేసీఆర్ కు సమాధానం:కేసీఆర్ ఏపీ రోడ్ల గురించి మాట్లాడుతున్నారని, కేంద్రం నిధులివ్వకుంటే తెలంగాణలో రోడ్లు ఎక్కడివని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో ఎన్‌హెచ్‌లు, రైల్వేల అభివృద్ధికి.. రాష్ట్రానికి కేంద్రం భారీగా నిధులిచ్చిందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం పాత్ర కీలకమని చెప్పారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని, ఒక కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిందని కిషన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్‌ఎస్ పాలన సాగుతోందని, దళితుడిని సీఎం చేస్తామని కేసీఆర్ మాట తప్పారని, నియంతలా పరిపాలిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు లేకుండా చేశారని, రాష్ట్రంలో ప్రజలు సీఎంను కలిసే అవకాశమే లేదని అన్నారు.
జనసేనతో అందుకే పొత్తు:జనసేన ఎన్డీయే భాగస్వామి కాబట్టే ఆ పార్టీతో పొత్తు ఉందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కే తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పై కూడా కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. గ్యారెంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. ఐదేళ్లలో వచ్చే వ్యతిరేకత కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఐదు నెలల్లోనే వచ్చిందని విమర్శించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు డబ్బు పంపించేందుకు కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ట్యాక్స్ వసూలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణకు బీసీ నేత ను ముఖ్యమంత్రిని చేయటమే బీజేపీ లక్ష్యమని చెప్పారు
-
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications