Bandi Sanjay: పిల్లలతో కలిసి క్రికెట్ ఆడిన బండి సంజయ్..
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పిల్లలతో సరదాగా క్రికెట్ ఆడారు. సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించనుంది. పెరేడ్ గ్రౌడ్ లో నిర్వహించి ఈ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించడానికి ఆదివారం బండి సంజయ్ పెరేడ్ గ్రౌండ్ కు వచ్చారు. అక్కడే క్రికెట్ ఆడుతున్న పిల్లలతో కలిసి క్రికెట్ ఆడారు. దీన్ని బీజేపీ కార్యకర్తలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
బండి సంజయ్ మొదటి నుంచి పిల్లలు అంటే ఇష్టం. ఆయన ఎప్పుడు పిల్లలు కనిపించినా వారితో కలివిడిగా ఉంటారు. గతంలో పిల్లలతో కలిసి సంజయ్ డ్యాన్స్ చేయడం, ఆట ఆడడం వంటివి చేశారు. కాగా సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబోయే తెలంగాణ విమోచన దినోత్సవానికి కేంద్ర హోమ్ అమిత్ షా రానున్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్ అంతకుముందు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు.

సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఎందుకు నిర్వహించడం లేదని బండి ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ సమైక్యతా దినోత్సవం అంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటుందని ఎద్దేవా చేశారు. ప్రజా పాలన దినోత్సవంలో పాల్గొనాలని తనకు ఆహ్వానం అందిందని వివరించారు. ప్రజా పాలన దినోత్సవాన్ని విమోచన దినోత్సవంగా పేరు మారిస్తే ప్రభుత్వ కార్యక్రమానికి హాజరవుతానని స్పష్టం చేశారు.
గతంలో ఏ ప్రభుత్వం కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేదని గుర్తు చేశారు. నిజాం పాలనలో ప్రజలు పడిన ఇబ్బందులు, పోరాటాలు, మహిళల మీద జరిగిన దాడులు , పరకాల, బైరాన్ పల్లి, నిర్మల్ ఘటనలను ప్రజల కళ్లకు కట్టిన విధంగా ఫొటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసినట్లు బండి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications