కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు: ఐపి అడ్రస్‌లపై ఫేస్‌బుక్ ఝలక్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: ఫేస్‌బుక్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఏ ఐపీ అడ్రస్‌ నుంచి ఆ పోస్టులు పెట్టారో తెలియజేయాలని సీసీఎస్‌ అధికారులు ఫేస్‌బుక్‌ను కోరుతూ లేఖ రాశారు.

అయితే, వారి విజ్ఞప్తిని ఫేస్‌బుక్‌ తిరస్కరించింది. ఆ వివరాలు ఇప్పించాలంటూ సీఐడీ అధికారులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. రామకృష్ణ ఆకుతోట అనే ఐడీతో ఒకతను ఫేస్‌బుక్‌లో గత నవంబరులో సీఎం కేసీఆర్‌పై పలు ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టారు.

 ఆ వ్యాఖ్యలపై ఫిర్యాదు

ఆ వ్యాఖ్యలపై ఫిర్యాదు

హైదరాబాదులోని ఆజంపురాకు చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్త వసీం అలీ ఆ పోస్టులపై పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. దానిపై చాదర్‌ఘాట్‌ పోలీస్టేషన్‌లో నవంబర్‌ 13న కేసు నమోదైంది. స్థానిక పోలీసులు తదుపరి దర్యాప్తు నిమిత్తం ఈ కేసును సీసీఎస్‌(సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌)కు బదిలీ చేశారు.

 ఫేస్‌బుక్‌కు లేఖ రాశారు..

ఫేస్‌బుక్‌కు లేఖ రాశారు..

కెసిఆర్‌పై చేసిన ఆ వ్యాఖ్యలు ఏ ఐపీ అడ్రస్‌ నుంచి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ అయ్యాయనే వివరాలు కావాలని సీసీఎస్‌ అధికారులు గత నెలలో ఫేస్‌బుక్‌ సంస్థకు లేఖ రాశారు. ఐపీ అడ్రస్‌ ఇచ్చేందుకు ఆ సంస్థ నిరాకరించింది. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న సీఐడీ ద్వారా ఎంహెచ్‌ఏకు లేఖ రాశారు.

 ఎంహెచ్ఎకు లేఖ రాశారు..

ఎంహెచ్ఎకు లేఖ రాశారు..

కెసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యల విషయంలో ఫేస్‌బుక్‌ సంస్థతో సంప్రదించి కేసు దర్యాప్తునకు అవసరమైన సమాచారం ఇప్పించాలని లేఖలో కోరారు. మ్యూచువల్‌ లీగల్‌ అసిస్టెన్స్‌ ట్రీటీ ప్రకారం ఎంహెచ్‌ఏ ఫేస్‌బుక్‌ సంస్థపై ఒత్తిడి తెచ్చి దర్యాప్తునకు అవసరమైన సమాచారం రాబట్టేందుకు ఈ చర్యలు తీసుకున్నారు.

 మరో పది రోజుల్లో వివరాలు

మరో పది రోజుల్లో వివరాలు

మరో 10 రోజుల తర్వాత ఐపీ అడ్రస్‌ వివరాలు వచ్చే అవకాశం ఉందని, ఆ తర్వాత కేసు దర్యాప్తులో తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు కావడంతో సిసిఎస్ పోలీసులు దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Facebook has rejected to give IPaddresses in a case related unwanted comments on Telangana CM K Chandrasekhar Rao (KCR).

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి