మహిళలు, యువతుల ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్: ఆ ఇన్‌స్టా పేజీపై కేసు నమోదు

హైదరాబాద్: మహిళలు, ముఖ్యంగా యువతుల ఫొటోలను వారి అనుమతి లేకుండానే సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. అంతేగాక, అసభ్యకరమైన శీర్షికలతో యువతులు, మహిళలు ఫొటోలు పెడుతుండటంతో సంబంధిత ఇన్‌స్టాగ్రామ్ పేజీపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 15,000 మంది ఫాలోవర్లను కలిగి ఉన్న jamunda_2 పేజీ.. నిర్దిష్ట వ్యక్తులను, ప్రత్యేకంగా యువతులను లక్ష్యంగా చేసుకునే వీడియోలను షేర్ చేస్తుంది. ఇది వారి వీడియోలను అవమానకరమైన ట్యాగ్‌లు, శీర్షికలతో పోస్ట్ చేస్తోంది.

 uploading videos of women without their consent: Case filed against stalker Instagram page

అలాంటి వీడియోలను షూట్ చేయమని పేజీ.. ప్రజలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. 900 మంది వ్యక్తులు అలాంటి వీడియోలను చిత్రీకరించారని, వాటిని ఈ ఖాతాలో అప్‌లోడ్ చేశారని తెలిసింది.

ఈ క్రమంలో పోలీసులు ఐపీసీ సెక్షన్లు 506 (క్రిమినల్ బెదిరింపు), 509 (మహిళలను అవమానించడం), 354 (డి) (వెంబడించడం), ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

పేజీ నిర్వాహకులకు సంబంధించిన పూర్తి డేటాను అందించాలని పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌కు కూడా లేఖ రాశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+