కేటీఆర్ బచ్చా, సిగ్గుండాలి, నేను రెడీ: దులిపేసిన ఉత్తమ్, 6 శాతం కమీషన్ అని సంచలనం

హైదరాబాద్: తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విసిరిన సవాల్‌ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వీకరించారు. 2019లో టీఆర్ఎస్ 100కు పైగా సీట్లు గెలుస్తుందని చెబుతున్నారని, అలా గెలిస్తే రాజకీయ సన్యాసానికి సిద్ధమని ప్రకటించారు.

2019లో తెరాస అధికారంలోకి రాకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, అదే కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే ఉత్తమ్ ఆ పని చేస్తారా అని కేటీఆర్ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉత్తమ్ స్పందించారు.

నేను సిద్ధం, మీరు సిద్ధమా

నేను సిద్ధం, మీరు సిద్ధమా

కేటీఆర్ సవాల్ స్వీకరిస్తున్నానని ఉత్తమ్ చెప్పారు. 2019లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తమ కుటుంబం అంతా రాజకీయాల్లో నుంచి తప్పుకుంటుందని చెప్పారు. మరి కాంగ్రెస్ గెలిస్తే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు.. ఇలా వారి కుటుంబం అంతా తప్పుకుంటుందా అని ప్రతిసవాల్ విసిరారు.

పదేపదే చెబుతున్నారు, ఏం చేస్తారో చెప్పండి

పదేపదే చెబుతున్నారు, ఏం చేస్తారో చెప్పండి

టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తమ కుటుంబం మొత్తం రాజకీయాల నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమని, కేటీఆర్ కూడా తన అలా చేస్తారా అని నిలదీశారు. టీఆర్ఎస్‌కు వంద సీట్లకు పైగా వస్తాయని పదేపదే చెబుతున్నారని, అలా రాకుంటే కూడా ఏం చేస్తారో వారు చెప్పాలని నిలదీశారు.

కేటీఆర్ ఓ బచ్చా, సిగ్గుండాలి

కేటీఆర్ ఓ బచ్చా, సిగ్గుండాలి

రాజకీయాల్లో కేటీఆర్ ఓ బచ్చా అని ఉత్తమ్ అన్నారు. అధికారంతో ఆయన కళ్ళు నెత్తికెక్కాయని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ అధికారంలో ఉంటే ప్రమాదకరమని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేసేందుకు సిగ్గుండాలని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

6 శాతం ఇవ్వాల్సిందేనని ఉత్తమ్ సంచలనం

6 శాతం ఇవ్వాల్సిందేనని ఉత్తమ్ సంచలనం

మీ పాలన అద్భుతం అయితే తమ విమర్శలకు ఎందుకు భయపడుతున్నారని ఉత్తమ్ సూటిగా ప్రశ్నించారు. అడ్డగోలుగా మాట్లాడితే కేసులు పెట్టాల్సి వస్తే తాము అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్ మీద ఎన్నో కేసులు పెట్టవలసి వచ్చేదన్నారు. తెలంగాణలో ఎవరికి కాంట్రాక్ట్ ఇవ్వాలన్నా ఆరు శాతం ఇవ్వనిది రాదని సంచలన ఆరోపణలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+