వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏదో మతలబు: ఉత్తమ్ డౌట్, ఓటుకు నోటు కేసుపై కెసిఆర్ ఆరా

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు పైన మంత్రి హరీష్ రావు, సీఎం కెసిఆర్‌లకే అవగాహన లేదని, ప్రాజెక్టు రూపకల్పననే మార్చడం వెనుక ఏదో మతలబు ఉందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం ఘాటైన విమర్శలు చేశారు.

ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు పైన ప్రతిపక్షాలు అనవసరమైన విమర్శలు చేస్తున్నాయన్న హరీష్ రావు వ్యాఖ్యలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అసలు ఆ ప్రాజెక్టు గురించి వారికే అవగాహన లేదన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరంకు ప్రాజెక్టు మార్చడం సరికాదన్నారు. ప్రాజెక్టుపై మూడ్రోజుల్లో వివరాలు వెల్లడిస్తామన్నారు.

ఓటుకు నోటు కేసుపై కెసిఆర్ ఆరా

Uttam Kumar Reddy doubts on Pranahita project changing

ఓటుకు నోటు కేసుపై కెసిఆర్ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. క్యాంపు కార్యాలయంలో ఏసీబీ డీజీ ఎకే ఖాన్‌తో ఆయన భేటీ అచ్చారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది కూడా చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సండ్ర అరెస్టు, జిమ్మి బాబు కోసం గాలిస్తున్న విషయమై ఆరా తీసినట్లుగా తెలుస్తోంది.

కొనసాగుతున్న సండ్ర విచారణ

ఓటుకు నోటు కేసులో కేసులో సత్తుపల్లి టీడీపీ సండ్ర వెంకట వీరయ్యను తెలంగాణ ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ప్రధానంగా ఫోన్ సంభాషణల్లో వినిపించిన జనార్ధన్ గురించి ఆరా తీసే ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.

English summary
Uttam Kumar Reddy doubts on Pranahita project changing
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X