Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసిందే టిఆర్ఎస్, అభద్రతకు కెసిఆరే కారణం'

హైదరాబాద్: నగరంలోని ఇతర ప్రాంతాల వారిని దుర్భాషాలాడి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసింది అధికార టిఆర్ఎస్ పార్టీ నేతలేనని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం మండిపడ్డారు. మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. హైదరాబాదులో అభద్రతకు కారణం తెరాస నేతలే అన్నారు.

సోనియా గాంధీ వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు తెరాస ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పారు. హైదరాబాదుకు ఈ గుర్తింపు కాంగ్రెస్ పార్టీ చలవే అన్నారు. హైదరాబాదులో ఫార్మా రంగం, పరిశ్రమల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ముందుచూపు వల్లే అన్నారు.

గ్రేటర్ ఎన్నికలకు తెరాస భయపడిందని మండిపడ్డారు. ఎన్నికల్లో అక్రమాలకు తెరలేపుతోందన్నారు. ఎన్నికల సంఘం తీరు పైనా తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ప్రచారంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించలేదని, ముందుగానే తెరాస హోర్డింగులు పెట్టుకుందన్నారు.

Uttam Kumar Reddy lashes out at TRS government

10 నెలల కాలంలో తెరాస చేసింది ప్రచారం ఆర్భాటం తప్ప ఏమీ లేదన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌ను ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఎన్నికల్లో అక్రమాల ద్వారా గెలవాలని కెసిఆర్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, అందుకే అక్రమాలకు పాల్పడుతోందని, వార్డుల విభజన ఏకపక్షంగా చేసిందన్నారు.

మెట్రో రైలు నిర్మాణం ఎప్పుడో పూర్తి కావాలని, కానీ ప్రభుత్వం అర్థరహిత నిర్ణయాలతో ఇంకా అది పూర్తి కాలేదన్నారు. ఇతర ప్రాంతాల వారిని దుర్భాషాలాడి హైదరాబాద్ బ్రాండ్‌ను దెబ్బకొట్టింది తెరాస నాయకులు కాదా అని ప్రశ్నించారు. ఇతర ప్రాంతాల ప్రజల అభద్రతా భావానికి అధికార పార్టీ నేతలే కారణమన్నారు.

కోర్టు మొట్టికాయలు వేస్తే గానీ అధికార పార్టీకి గ్రేటర్ ఎన్నికలు గుర్తుకు రాలేదన్నారు. కెసిఆర్ చివరకి హైదరాబాద్ ప్రజలను కూడా మోసం చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. ఎన్నికల హామీలను మర్చిపోయి కొత్త హామీలు గుప్పించడం విడ్డూరమన్నారు.

Uttam Kumar Reddy lashes out at TRS government

ఫీజు రీయింబర్సుమెంట్స్ తీసుకు వచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని, దానిని నాశనం చేసింది కెసిఆర్ అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ.. తదితరాల మాట ఏమిటన్నారు. నియోజకవర్గానికి కేవలం నాలుగు వందల ఇళ్లు ఇచ్చి తెరాస ఎంతో ప్రచారం చేసుకుంటోందన్నారు.

విద్యార్థులు బోధనా రుసుముల కోసం నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. దళితులకు మూడెకరాల భూమి, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ పక్కా ఇళ్లు కట్టించిన విషయం ప్రజలు మర్చిపోలేదన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+