కాకా నువ్వు కేక! ఎండలో ఛలాన్లు ఎందిరా బై! వీహెచ్ హల్‌చల్!
తెలంగాణా రాష్ట్రంలో ఉన్న రాజకీయనాయకులలో వీహెచ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. రాజకీయాల్లో అయినా , సామాజిక అంశాల్లో అయినా ఆయన స్పందిస్తున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రోడ్ మీద ఎక్కడ ఏం జరిగితే మనకెందుకులే అని ఫీల్ అయ్యే రాజకీయ నాయకులున్న ఈ రోజుల్లో మండుటెండల్లో వాహనదారులను ఆపి చలాన్లు రాస్తున్న పోలీసులను వీహెచ్ హడలగొట్టారు.
హైదరాబాదులోని తెలుగుతల్లి ఫ్లై ఓవర్ సమీపంలో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను ఆపి, చలాన్లు వేస్తున్న సందర్భంలో అటువైపుగా వీహెచ్ వెళ్తున్నారు. మండుటెండలో చలాన్లు రాస్తున్న పోలీసులపై మండిపడ్డారు. చలాన్ల వ్యవహారాన్ని గమనించిన ఆయన ముందు కారు నుంచి దిగి, వాహనదారులతో మాట్లాడారు. ఆ తర్వాత పోలీసులపై ఫైర్ అయ్యారు.

ఓ వైపు ఎండలు మండిపోతుంటే, జనాలను ఎందుకు పరేషాన్ చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే అందరినీ పంపించేయాలని తన స్టైల్ లో గట్టిగా గదమాయించి చెప్పారు. అంతేకాదు, దగ్గరుండి మరీ వాహనదారులను పంపించేశారు. ఇక ట్రాఫిక్ పోలీసుల బారి నుండి కాపాడిన వీహెచ్ కు వాహనదారులు థాంక్స్ చెప్పారు. మొత్తానికి కాకా నువ్ కేక అంటున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications