Amberpet flyover: నెరవేరిన దశాబ్దాల కల, వాహనాలు రయ్ రయ్!

హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట్ వైపు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త అందింది. పనులు పూర్తి కావడంతో ఫ్లైఓవర్‌పై బుధవారం రాకపోకలు ప్రారంభమయ్యాయి. స్థానిక పార్లమెంటు సభ్యుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో అధికారులు వాహనాల రాకపోకలను అనుమతించారు. దీంతో శివరాత్రి రోజు నుంచే రాకపోకలు కొనసాగుతున్నాయి.

కాగా, అంబర్‌పేట్ ఫ్లైఓవర్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. కింద భాగాన రోడ్డు నిర్మాణం, గ్రీనరీ, సుందరీకరణ పనులు పూర్తి చేసి అధికారికంగా మరికొన్ని రోజుల్లో ఫ్లైఓవర్ ప్రారంభించనున్నారు. అప్పటి వరకు ప్రయాణికుల సౌకర్యార్థం మహా శివరాత్రి నుంచి ఈ ఫ్లైఓవర్‌పై రాకపోకలకు అనుమతించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Vehicular movement on Amberpet flyover begins on Kishan Reddy s orders

మంగళవారం నాడే ఆయన ఫ్లైఓవర్ పనులను కిషన్ రెడ్డి పర్యవేక్షించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో బుధవారం నుంచి అంబర్‌పేట్ ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. చాలా కాలంగా ఫ్లై ఓవర్ ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని ఈ ప్రాంతం ప్రజలు ఎదురుచూస్తున్నారు. దశాబ్దాల కల నెరవేరడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

'భారత ప్రభుత్వం మద్దతుతో రూ. 338 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ ఫ్లైఓవర్, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ అడ్డంకుల కారణంగా దశాబ్దాలుగా జాప్యం తర్వాత నేటి నుంచి పనిచేయనుంది. ఈ కీలకమైన ప్రాజెక్ట్ వరంగల్, ఖమ్మం మధ్య నివాసితులు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న తీవ్రమైన ట్రాఫిక్ రద్దీని పరిష్కరిస్తుంది, ఇది చాలా అవసరమైన ఉపశమనాన్ని అందిస్తుంది' అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+