విమాన ప్రమాదం గురించి నేనే ముందు చెప్పానన్న వేణుస్వామి... వీడియోలు కూడా పెట్టాడుగా!
వేణు స్వామి.. సెలబ్రిటీలకు సంబంధించి వివాదాస్పద జ్యోతిష్యం చెప్పే వేణు స్వామి ఏం చెప్పినా సంచలనమే. 2020 నుండి ఆయనకు ఎక్కువ పేరు వచ్చింది. కరోనా సమయంలో సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా గుర్తింపు పొందిన వేణు స్వామి, చాలా మంది సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను బయటపెట్టి ఆయన వార్తల్లో నిలిచారు.
సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా వేణుస్వామికి పేరు
సమంత, నాగచైతన్యల గురించి జ్యోతిష్యం చెప్పి అందరినీ షాక్ కు గురి చేసిన వేణుస్వామి జాతకరీత్యా విడిపోతారని చెప్పారు. పెళ్లయిన నాలుగేళ్లకే సమంత, నాగచైతన్య విడిపోవడంతో వేణు స్వామి చెప్పింది నిజమైంది. దీంతో చాలామంది ఆయనను సంప్రదించడం మొదలుపెట్టారు. రష్మిక నుండి ఆషు రెడ్డి వరకు చాలామంది హీరోయిన్లు ఆయనతో రాజశ్యామల యాగం చేయించుకుని స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారు.

జాతకాలు చెప్పనన్న వేణుస్వామి
వేణు స్వామి చేసిన కొన్ని వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. ముఖ్యంగా ప్రభాస్ సినిమా కెరీర్ గురించి, రాజకీయాల గురించి వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ మళ్ళీ గెలుస్తారని, కూటమికి ఓటమి తప్పదని ఆయన చెప్పడంతో నెటిజన్లు ఆయనను టార్గెట్ చేశారు . ఆ తర్వాత ఆయన జ్యోతిష్యం చెప్పనని బహిరంగంగా ప్రకటించారు.
విమాన ప్రమాదంపై నిజమైన వేణు స్వామి జ్యోతిష్యం
అయితే 2025 ఉగాది సందర్భంగా మళ్లీ పంచాంగం చెప్పడం మొదలుపెట్టారు. ఆయన చెప్పిన మాటలను చాలామంది పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆయన చెప్పిన విషయాలు నిజం అయ్యాయని, ఆయన కంటే గొప్ప జ్యోతిష్యుడు మరొకరు లేరని మళ్ళీ ఆయనకు ఆయనే ప్రమోషన్ మొదలెట్టారు. నిన్న అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం భారత దేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని కలచివేసింది.
ఉగాది పంచాంగ శ్రవణంలో విమాన ప్రమాదాలు జరుగుతాయన్న వేణుస్వామి
242 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న విమానం ఒక మెడికల్ కాలేజీపైన కుప్పకూలిపోయింది. గాల్లోకి ఎగురుతున్న విమానం 865 అడుగుల ఎత్తులో పేలిపోయింది. ఆ విమానంలో 80 టన్నుల ఇంధనం ఉండడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 241 మంది అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఈ ఘటనను వేణు స్వామి ముందే ఊహించారు. ఉగాది పంచాంగ శ్రవణంలో విమాన ప్రమాదాలు జరుగుతాయని చెప్పారు.
వేణు స్వామి చెప్పిన జ్యోతిష్యం నిజమైంది
ఉగాది పంచాంగంలో వేణు స్వామి మాట్లాడుతూ, "2025 సంవత్సరంలో విమాన ప్రమాదాలు, పడవ ప్రమాదాలు, రైలు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అగ్ని ప్రమాదాలు కూడా సంభవించవచ్చు" అని అన్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే వేణు స్వామి చెప్పిందే నిజమవుతోంది. దీనిని బట్టి చూస్తే, ఇంతకంటే గొప్ప జ్యోతిష్యుడు మన భారతదేశంలో మరొకరు లేరని అప్పుడు ఆయన అనేక చానల్స్ లో మాట్లాడిన వీడియోలను ఆయనే సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మొత్తానికి వేణు స్వామి చెప్పిన జ్యోతిష్యం నిజం కావడంతో ఆయన గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications