మరో కీలక అప్‌డేట్ ఇచ్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరో కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ నగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించే వారిలో పేదల కంటే ధనవంతులు, సంపన్నులే ఎక్కువగా కనిపిస్తున్నారని రంగనాథ్ వ్యాఖ్యానించారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా
ఆక్రమణదారుల్లో ఉన్నారని వెల్లడించారు.
ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే ఎవరిని ఉపేక్షించేదని లేదని రంగనాథ్ తేల్చి చెప్పారు. బేగంపేటలోని ఓ హోటల్లో జాతీయ బయోడైవర్సిటీ అథారిటీ, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ లోకల్ ఎన్విరాన్‌మెంటల్ ఇనీషియేటివ్ ఆధ్వర్యంలో అర్బన్ బయోడైవర్సిటీ అనే అంశంపై శనివరాం నిర్వహించిన జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.

ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. చెరువుల పరిరక్షణ, పునరుద్దరణ చర్యలపై ఎక్కువగా దృష్టి పెట్టామన్నారు. లోటస్ పాండ్లో ఏకంగా ఓ వ్యక్తి ఎకరం స్థలం కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే హైడ్రా అడ్డుకుందన్నారు. హైడ్రా చర్యలకు ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుందన్నారు.
అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో కోర్టు తీర్పులు కూడా స్పష్టంగా ఉన్నాయని రంగనాథ్ తెలిపారు. త్వరలోనే హైడ్రాకు పోలీస్ స్టేషన్ రాబోతుందని, హైడ్రాకు వచ్చే ఫిర్యాదులను వెనువెంటనే పరిశీలించి చర్యలు తీసుకోనున్నట్లు రంగనాథ్ ఈ సందర్భంగా వెల్లడించారు.












Click it and Unblock the Notifications