వీడియో: నిజామాబాద్ జిల్లా హున్సాలో పిడిగుద్దుల హోలీ.. ఎలా జరిగిందో మీరే చూడండి!!
విచిత్ర సాంప్రదాయంలో భాగంగా హోలీకి నిజామాబాద్ జిల్లా హున్సాలో పిడిగుద్దులాట జరిగింది. గ్రామ కూడలిలో జనాలు పిడి గుద్ధులతో రెచ్చిపోయారు. ఆపై పరస్పరం ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకున్నారు..
నిజామాబాద్: హోలీ పండుగ రోజున అందరూ రంగులు చల్లుకుని హోలీ ఆడితే నిజామాబాద్ జిల్లాలో రక్తం వచ్చేలా కొట్టుకుని హోలీ ఆడతారు. మీకు అతిశయోక్తిగా అనిపించినా ఇది నిజం . నిజామాబాద్ జిల్లా హున్సా గ్రామంలో వింత ఆచారంలో భాగంగా హోలీ నాడు పిడి గుద్ధులతో ఫైటింగ్ కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం తమ వింత ఆచారాన్ని కొనసాగిస్తూ నిజామాబాద్ జిల్లా హున్సా గ్రామంలో పిడిగుద్దులాట కొనసాగింది.
అనాదిగా వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తూ హున్సా గ్రామస్తులు పిడిగుద్దులాటను కొనసాగించారు. గ్రామ కూడళ్లలో చేరి ముష్టి ఘాతాలతో రెచ్చిపోయారు. ఒకరిని ఒకరు ఇష్టం వచ్చినట్టు కొట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా సాలూర మండలం హున్సా గ్రామంలో హోలీ సందర్భంగా ఏటా ఆనవాయితీగా నిర్వహిస్తున్న పిడిగుద్దులాట ఈ సంవత్సరం కూడా హోలీ రోజు సాయంత్రం యథావిధిగా కొనసాగింది. ప్రజలు ఉదయం హోలీ ఆడిన తరువాత సాయంత్రం హనుమాన్ ఆలయం ఎదురుగా తాడుకు ఇరువైపులా రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడి గుద్దులు కురిపించారు. చిన్నా పెద్దా తేడా లేకుండా దాడులు చేసుకున్నారు.

రక్తం వచ్చిన చోట కాముని బూడిదతో తుడుచుకున్నారు. ఆట ముగియగానే పరసర్పం ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ ఆటను ఉద్దేశించి గ్రామస్తులు ప్రతి ఒక్కరు కనీసం అయిదు నిమిషాలపాటు అయినా ఈ ఆట ఆడాలని చెబుతున్నారు. ప్రతి సంవత్సరం హోలీ రోజున కొనసాగే ఈ క్రీడ నిర్వహించకపోతే చెడు జరుగుతుందని గ్రామస్థుల నమ్మకంతో ఈ ఆచారం కొనసాగుతోందని అక్కడ వారు బలంగా నమ్ముతున్నారు.
నిజామాబాద్ జిల్లా హున్సాలో పిడిగుద్దుల హోలీ.. ఎలా జరిగిందో మీరే చూడండి..!!#Nizamabad #Holi2023 #HoliCelebrations #Holi #TelanganaNews #Oneindiatelugu pic.twitter.com/OjnRZDf6jl
— oneindiatelugu (@oneindiatelugu) March 8, 2023
అంతకుముందు గ్రామ శివారులో కుస్తీ పోటీలు నిర్వహించారు. అనంతరం పిడిగుద్దులాటను కొనసాగించి గ్రామంలో ఎప్పటినుంచో వస్తున్న తమ ఆచారాన్ని కొనసాగించారు. ఈ పిడిగుద్దులాట ఆడకపోతే గ్రామానికి అరిష్టమని, ఒక సంవత్సరం ఆడకపోతే గ్రామంలో ట్యాంకు కూలిందని, నష్టం జరిగిందని.. అందుకే ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఈ క్రీడను కొనసాగిస్తున్నామని చెబుతున్నారు. ఇది తమ విశ్వాసమని, ఈ ఆటలో దెబ్బలు తగిలినా అవి త్వరగానే మానిపోతాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications