కేసీఆర్ పై రాములమ్మ పోటీ, అక్కడే - కాంగ్రెస్ లేటెస్ట్ డెసిషన్..!!
తెలంగాణ ఎన్నికల రాజకీయం ఆసక్తికర మలుపులు తీసుకుంటోంది. బీజేపీ ఫైర్ బ్రాండ్ విజయశాంతి కాంగ్రెస్ లోకి చేరటం ఖాయమైంది. రాములమ్మతో కాంగ్రెస్ ముఖ్య నేతలు మంతనాలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ నుంచి భారీ ఆఫర్ ఇచ్చారు. కాంగ్రెస్ కండువా కప్పుకొనేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ ఎన్నికల్లోనే సీఎం కేసీఆర్ పైన రాములమ్మను బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు కీలక చర్చలు జరుగుతున్నాయి.
కాంగ్రెస్ లోకి రాములమ్మ: ఫైర్ బ్రాండ్ రాములమ్మ కాంగ్రెస్ కండువా కప్పుకోవటం ఖాయమైంది. రేపు (గురువారం) కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని బీజేపీ నేతలు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, వ్యూహం బెడిసి కొడుతోంది. కొత్త నేతలు చేరకపోగా..ఉన్న నేతలే పార్టీని వీడుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ తరువాత ఇప్పుడు రాములమ్మ అదే బాట పట్టారు.

బీజేపీ తీరుతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అందుకే పార్టీతో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. రాములమ్మ పార్టీ మారుతారనే ప్రచారం సాగుతున్నా ఎక్కడా ఖండనలు లేవు. ఎన్నికల వేళ బీజేపీలోనూ యాక్టివ్ గా లేరు. తొలుత రాములమ్మ అసెంబ్లీ బరిలో ఉంటారని పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. కానీ, అభ్యర్దుల ఎంపిక ప్రక్రియలో విజయశాంతి ప్రస్తావన లేదు.
కేసీఆర్ పై పోటీకి సిద్దం: తాజాగా విజయశాంతి చేసిన ట్వీట్ సైతం తన మనసులో మాట ఏంటో స్పష్టం చేసేలా ఉంది. కేసీఆర్ నుంచి తెలంగాణను కాపాడుకునేందుకు కొందరు కాంగ్రెస్‌లో చేరాలని కోరుతున్నారని.. మరికొందరు బీజేపీలోనే ఉండమంటున్నారని ట్వీట్‌లో రాసుకొచ్చారు. అయితే ఇద్దరి అభిప్రాయం తెలంగాణ మేలు కోసమేనని.. సినిమాల్లో లాగా రాజకీయాల్లో డబుల్ యాక్షన్ కుదరదని ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీ , అమిత్ షా,కేంద్ర మంత్రులు తెలంగాణలో పర్యటించినప్పటికీ ఎక్కడా రాములమ్మ కనిపించలేదు. బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించిన నాటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ ముఖ్య నేతలురాములమ్మతో టచ్ లోకి వచ్చారు. భారీ ఆఫర్ ఇచ్చారు. దీనికి రాములమ్మ సైతం ఓకే చేసినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ అభ్యర్ది మార్పు..!: ఈ ఎన్నికల్లోనే విజయశాంతిని గజ్వేల్ నుంచి బరిలోకి దించేందుకు కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలుత మెదక్ నుంచి పార్టీ ఎంపీ అభ్యర్దిగా దింపాలని పార్టీ భావించినా..కామారెడ్డి నుంచి రేవంత్ పోటీ చేస్తున్న వేళ విజయశాంతిని గజ్వేల్ నుంచి పోటీ చేయించటం ద్వారా ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ అంచనాకు వచ్చింది.
ఇందుకు విజయశాంతి సైతం సై అన్నట్లు తెలుస్తోంది. దీంతో, గజ్వేల్ నుంచి ఇప్పటికే ప్రకటించిన నర్సారెడ్డి స్థానంలో విజయశాంతిని బరిలోకి దింపటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. నర్సారెడ్డికి భవిష్యత్ గురించి పార్టీ నుంచి స్పష్టమైన హామీ ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో, ఈ నిర్ణయం పైన కాంగ్రెస్ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications